E-Paper
Advertisement

సీఎం బిశ్వశర్మపై రాహుల్‌గాంధీ ఆగ్రహం.. ఆయన్ని వదిలిపెట్టం, చట్టపరమైన చర్యలు తప్పవు

సీఎం బిశ్వశర్మపై రాహుల్‌గాంధీ ఆగ్రహం.. ఆయన్ని  వదిలిపెట్టం, చట్టపరమైన చర్యలు తప్పవు
Advertisement

Assam Assembly Elections-2026: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. ఆయన అత్యంత అవినీతిపరుడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.

అస్సాంలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

Advertisement

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిశ్వనాథ్‌ చరియాలీలో తలపెట్టిన ప్రచార సభలో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం హిమంత బిశ్వశర్మను దేశంలో అత్యంత అవినీతిపరుడిగా అభివర్ణించారు. ఆయన క్షమాపణలు చెప్పినా వదిలి పెట్టబోమని తేల్చిచెప్పారు.

అస్సాం ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తన జీవితాంతం దివంగత గాయకుడు జుబిన్‌ గార్గ్‌ కృషి చేశారని తెలిపారు. ఆయన ఎవరితో దురుసుగా ప్రవర్తించలేదని, మా పార్టీ భావజాలం అలాంటిదేనని అన్నారు. ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమను పంచడమే మా సిద్ధాంతమని మనసులోని మాట బయటపెట్టారు.

Advertisement

సీఎం హిమంత బిశ్వశర్మపై ఘాటు వ్యాఖ్యలు చేసిన రాహుల్‌గాంధీ

తాము అధికారంలోకి రాగానే ఆయన మృతి కేసు నిందితులను కేవలం 100 రోజుల్లోగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. హిమంత బిశ్వశర్మ సర్కారు ప్రజల్లో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు రాహుల్‌ గాంధీ. ఆయన అవినీతి చిట్టా ప్రధాని, హోం మంత్రి వద్ద ఉందన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ ఏటీఎం మాదిరిగా మార్చేశారని విమర్శించారు.

సంక్షేమ చర్యలు, సామాజిక గుర్తింపుపై దృష్టి సారిస్తుందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో కీలక హామీల గురించి వివరించారు. అస్సాంలోని ఆరు వర్గాలకు షెడ్యూల్డ్ కుల/షెడ్యూల్డ్ తెగ హోదాను కల్పిస్తామని వెల్లడించారు. తేయాకు కార్మికుల వేతనాలను మెరుగుపరుస్తామని తేల్చి చెప్పారు.

ALSO READ: గ్యాస్ కష్టాలు తీరినట్టే.. ఆలస్యం లేకుండా క్షణాల్లో గ్యాస్ డెలివరీ, వినియోగదారుల క్యూ లైన్ మాటేంటి?

తేయాకు కార్మికులకు రోజుకు రూ. 450 ఇస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నట్లు వివరించారు. ఆర్థిక, సామాజిక సహాయక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అధికారం రాగానే తక్కువ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుందన్నారు.

 

Related News

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

Big Stories

Advertisement
×