E-Paper
Advertisement

Saurabh Sharma RTO: ‘టెంపర్’ సినిమాను మించిన అవినీతి.. రూ.28 వేల జీతం, రూ.1000 కోట్ల ఆస్తులు!

Saurabh Sharma RTO: ‘టెంపర్’ సినిమాను మించిన అవినీతి.. రూ.28 వేల జీతం, రూ.1000 కోట్ల ఆస్తులు!
Advertisement

Saurabh Sharma RTO: తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘టెంపర్’ సినిమా అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో హీరో చిన్నప్పటి నుంచే పోలీసై అవినీతి చేయాలని నిర్ణయించుకుంటాడు. అలా డబ్బులు దొరికే కేసులే డీల్ చేస్తూ కోట్లలో సంపాదిస్తాడు. క్లైమాక్స్ లో హీరో మారిపోవడం.. సినిమాకు ఎండ్ కార్డ్ పడడం శరా మామూలే.. కానీ ఇప్పుడు ఇదే తరహాలో, సినిమాను మించిన ట్విస్టులతో మధ్యప్రదేశ్‌లో ఒక రియల్ లైఫ్ ‘టెంపర్’ స్టోరీ వెలుగు చూసింది. అక్కడ ఆర్టీవోలో పనిచేసిన ఓ కానిస్టేబుల్ ఆస్తుల చిట్టా చూసి ఈడీ (ED) అధికారులే షాకయ్యారు. తండ్రి వారసత్వంగా వచ్చిన ఉద్యోగంలో చేరి పదేళ్లు కూడా నిండకముందే వందల కోట్లలో ఆస్తులు కూడబెట్టిన వైనం చూసి దేశంలోని అధికారులు, బ్యూరోక్రాట్లు ఖంగుతున్నారు.

రూ. 28 వేల జీతం.. రూ. 1000 కోట్ల ఆస్తులు

Advertisement

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఆర్టీవో కానిస్టేబుల్ సౌరభ్ శర్మ అవినీతి సామ్రాజ్యం చూసి దేశం మొత్తం నివ్వెరపోతోంది. కేవలం నెలకు రూ. 28 వేల జీతం తీసుకునే ఒక సాధారణ కానిస్టేబుల్, ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తండ్రి మరణం తర్వాత 2015లో కారుణ్య నియామకం కింద ఉద్యోగంలో చేరిన సౌరభ్, 2023లో వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్నాడు. కేవలం ఈ పదేళ్లలోపే ఇంతటి భారీ సంపదను పోగుచేసుకోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

ఇల్లు కట్టాడా.. నోట్ల కట్టలతో నింపాడా?

ఇటీవల సౌరభ్ ఇంటిపై అధికారులు దాడులు చేయగా, కళ్లు చెదిరే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బుల కట్టలే దర్శనమిచ్చాయి. గోడలకు పెయింట్ వేసినట్లు కాకుండా, నోట్ల కట్టలతోనే ఇల్లు కట్టాడా అనేంతలా భారీగా నగదు రాశులు బయటపడ్డాయి. ఐటీ మరియు ఈడీ అధికారులు జరిపిన సోదాల్లో సుమారు 10 కోట్ల నగదు, 25 కేజీల బంగారం, 234 కేజీల వెండి, లగ్జరీ కార్లు బయటపడ్డాయి. అంతేకాకుండా విదేశాల్లో, ముఖ్యంగా దుబాయ్‌లో విల్లాలకు సంబంధించిన పత్రాలు లభ్యం కావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. లైసెన్సులు, వెహికల్ రిజిస్ట్రేషన్లు, రోడ్ ట్యాక్స్ వసూళ్లలో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడి ఈ అక్రమాస్తులు సంపాదించినట్లు తేలింది.

జైలు ఊచలు లెక్కపెడుతున్న కుబేరుడు

Advertisement

కేవలం పదేళ్ల వ్యవధిలో ఒక చిన్న ఉద్యోగి ఇంతటి అవినీతికి పాల్పడటం వెనుక పెద్దల హస్తం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే సౌరభ్ శర్మపై ఈడీ, ఐటీ కేసులు నమోదు కాగా, 2025 జనవరి 28న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పటికీ, అతని ఆస్తుల చిట్టా మాత్రం ఇంకా బయటపడుతూనే ఉంది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా సంపాదించలేని ఆస్తిని ఒక కానిస్టేబుల్ ఎలా సంపాదించాడంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Nara Bhuvaneshwari: మాకు ఇంకా ముప్పు ఉంది.. ఫోన్ చేసి బెదిరిస్తున్నారు.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×