E-Paper
Advertisement

Slipper Stolen In Train: సెకండ్ ఏసీ క్లాసులో చెప్పులు చోరీ.. బాధితుడి అవస్థలు తెలిస్తే నవ్వేస్తారేమో!

Slipper Stolen In Train:  సెకండ్ ఏసీ క్లాసులో చెప్పులు చోరీ.. బాధితుడి అవస్థలు తెలిస్తే నవ్వేస్తారేమో!
Advertisement

రైళ్లలో, రైల్వే ప్రాంగణాలలో ప్రయాణీకులు జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు సూచిస్తుంటారు. మరీ ముఖ్యంగా రైల్లో వెళ్లే సమయంలో వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలంటారు. ప్యాసింజర్స్ తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు దొంగలు రెచ్చిపోతుంటారు. మోబైల్ ఫోన్లు, పర్సులు, నగలు కొట్టేస్తూనే ఉంటారు. ఈ మధ్య  రైళ్లలో సెల్ ఫోన్లు దొంగతనం చేస్తూ పట్టుబడిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. అయితే, తాజాగా  ప్యాసింజర్ తనకు ఎదురైన విచిత్రమైన అనుభవాన్ని రెడ్డిట్ వేదికగా పంచుకున్నాడు. రైళ్లలో విలువైన వస్తువులు కొట్టేడయం చూస్తాం,  కానీ, ఈ రకమైన దొంగతనం ఎప్పుడూ చూడలేదంటూ చెప్పుకొచ్చాడు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?    

తాజాగా ఓ ప్రయాణీకుడు పాటలీపుత్ర-బెంగళూరు రైలులోని 2AC కోచ్‌ లో ప్రయాణించాడు. ఆయనకు బాగా నిద్ర రావడంతో పడుకున్నాడు. నిద్ర నుంచి లేచే సమయానికి ఓ విచిత్రమైన అనుభవాన్ని చవిచూశాడు. “ప్రజలు 2ACలో ప్రయాణిస్తున్నారు. ఇందులో ప్రయాణించాలంటే టికెట్ ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ, వాళ్ల ఆలోచన చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే, నాకు తొలిసారి 2ACలో కూడా చెప్పుల దొంగతనం జరుగుతుందని తెలిసి వచ్చింది. భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్యాసింజర్లు ఇకపై కాస్త అలర్ట్ గా ఉండటం మంచిది. ఎందుకంటే, నేను పాటలీపుత్ర నుంచి బెంగళూరుకు 2ACలో ప్రయాణిస్తున్నాను. ఉదయం లేచి చూసే సరికి నా చెప్పులు పోయాయి” అని ఆయన చెప్పుకొచ్చారు.

క్రేజీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు!

Advertisement

అటు ఈ పోస్టు చూసి నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. రాత్రి పూట ప్రయాణంలో ఏదైనా జరగవచ్చంటున్నారు. అయినా, దొంగలకు ఏ వస్తువు అయితే ఏంటి కొట్టేయడానికి కామెంట్స్ చేస్తున్నారు. “ఎవరైనా పొరపాటున వాటిని తీసుకెళ్లారో? దొంగిలించాలో? తెలియదు. కానీ, 2AC టికెట్ కొన్న వ్యక్తులు రూ. 2,000 చెప్పులతో వెళ్లిపోతాయారు. ఇప్పుడు నేను SMVBలోకి చెప్పులు లేకుండా నడవాలి. కొంత ఫన్నీగా ఉన్నా, మరికొంత చిరాకు కలిగిస్తుంది” అని సదరు ప్రయాణీకుడు కామెంట్ చేశాడు. “తేజస్ ఎక్స్‌ ప్రెస్ ప్రారంభోత్సవ సమయంలో ఎవరో తన హెడ్‌ ఫోన్స్ దొంగిలించారు” అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.  ప్రీమియం రైళ్లు కూడా చిన్న దొంగతనాలకు అతీతం కాదని చెప్పుకొచ్చారు.

Read Also: భూమ్మీద కోల్డెస్ట్ రైలు ప్రయాణాలు, విండో ఓపెన్ చేస్తే గడ్డకట్టుకుపోతారండోయ్!

రైళ్లలో తరచుగా దొంగతనాలు!

Advertisement

వాస్తవానికి రైళ్లలో పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నప్పటికీ, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.  కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, చాలా వరకు వెలుగులోకి రాని ఘటనలే ఉన్నాయి. అటు రైల్వే అధికారులు మాత్రం ప్రయాణీకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూనే ఉన్నారు.

Read Also: పర్యాటకులకు విమానాల్లో ప్రయాణం ఉచితం.. థాయ్‌లాండ్ అదిరిపోయే ఆఫర్!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×