BigTV English

Seema Haider : మతం మారిన పాకిస్తాన్ యువతి.. సీమా హైదర్ నోట శ్రీరాముని పాట..

Seema Haider : ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గ్రేటర్‌ నోయిడాలోని రఘుపూర్‌లో ప్రస్తుతం తన ప్రియుడు సచిన్‌ మీనాతో కలిసి ఆమె నివసిస్తుంది. తాజాగా శ్రీరాముని కీర్తన చేసి అందరి ప్రశంసలు పొందింది. ముస్లిం మహిళ అయినా సీమ హిందు ఆరాధన చేయటం సంచలనం అయింది. సీమాతోపాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్‌ చాలీసా పఠిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా‌లో వైరల్ అవుతుంది.

సీమా- సచిన్ నివసించే రబూపురాలో స్థానిక ఆలయంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు రాముడి కీర్తనలు, హనుమాన్‌ పాటలు పాడారు. సీమా.. స్వాతి మిశ్రా పాడిన ‘రామ్‌ ఆయేంగే’ పాటను పాడారు. తలపై కాషాయ రంగు టోపి ధరించి ఆమె ఎంతో ఉత్సాహంతో పాటను పాడారు. ఆ తర్వాత ఆమెతోపాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్‌ చాలిసా పఠించాడు. ఆమె వెంట న్యాయవాది ఏపీ సింగ్‌ కూడా ఉన్నారు. ఈ వీడియోను ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

అనుమతి లభించగానే అయోధ్యలోని రామమందిరం దర్శనం‌కి వెళ్తామని సీమ హైదర్ తెలిపింది. భారత్‌లో తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. భారత్‌లో మహిళలకు ప్రత్యేక విలువ ఉందని ఆమె పేర్కొంది . ఆమె పూర్తిగా హిందూ మతంలోకి మారినట్లు ప్రకటించింది. ఆమె శ్రీకృష్ణుడు, శ్రీరాముడి భక్తురాలినని తెలిపింది.

కాగా.. ఇండియాలోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం సంచలనం సృష్టించింది. ఆన్‌లైన్‌లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్‌తో భారత్‌కి చెందిన సచీన్ మీనా‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. నేపాల్‌లో మొదటిసారిగా వీరు కలుసుకున్నారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు. అనంతరం సీమా పాకిస్థాన్ నుంచి తన నలుగురు పిల్లలతో కలిసి ఇండియాకు చేరుకుంది. గ్రేటర్ నోయిడాలో నివాసం ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చేసింది. సీమాకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టా ద్వారా తనకు సంబంధించిన విషయాలను షేర్‌ చేస్తూ నెటిజన్ల‌తో ఎప్పటికప్పుడు సీమా హైదర్ టచ్‌లో ఉంటుంది.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×