GUNTUR WEST : ఏపీలో గుంటూరు రాజకీయాల రూటే సపరేటు. చిల్లీ సిటీ ఆఫ్ ఇండియాగా గుంటూరుకు పేరు. పేరుకు తగ్గట్లే ఇక్కడి రాజకీయాలకు ఘాటెక్కువ. ఈసారి వైఎస్ఆర్ సీపీ, టీడీపీ రెండు పార్టీలు కూడా ఎందుకోగానీ కొత్త అభ్యర్థులవైపే మొగ్గు చూపుతున్నాయి. 2019లో నిలబెట్టిన అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టేశాయి. గుంటూరు వెస్ట్ ఓటర్ల మనోగతం ఎలా ఉందో గానీ.. పొలిటికల్ పార్టీలైతే.. నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం మాత్రం చేయలేకపోతున్నాయి.
GUNTUR WEST : ఏపీలో గుంటూరు రాజకీయాల రూటే సపరేటు. చిల్లీ సిటీ ఆఫ్ ఇండియాగా గుంటూరుకు పేరు. పేరుకు తగ్గట్లే ఇక్కడి రాజకీయాలకు ఘాటెక్కువ. ఈసారి వైఎస్ఆర్ సీపీ, టీడీపీ రెండు పార్టీలు కూడా ఎందుకోగానీ కొత్త అభ్యర్థులవైపే మొగ్గు చూపుతున్నాయి. 2019లో నిలబెట్టిన అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టేశాయి. గుంటూరు వెస్ట్ ఓటర్ల మనోగతం ఎలా ఉందో గానీ.. పొలిటికల్ పార్టీలైతే.. నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం మాత్రం చేయలేకపోతున్నాయి. అప్పుడెప్పుడో 1960ల్లో మాత్రమే రెండుసార్లు పోటీ చేసిన ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున చంద్రగిరి ఏసురత్నం నిలబడితే.. టీడీపీ నుంచి మద్దాలి గిరి పోటీ చేశారు. ఈసారి కొత్త అభ్యర్థులపై జన స్పందన ఎలా ఉండనుంది.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉందన్న విషయాలను తెలుసుకునే ముందు ఓసారి 2019 ఎన్నికల ఫలితాలను విశ్లేషిద్దాం.
2019 ఎన్నకల ఫలితాలు
చంద్రగిరి ఏసురత్నం VS మద్దాలి గిరి
YCP 39%
TDP 41%
OTHERS 16%
విడదల రజిని ప్లస్ పాయింట్స్
విడదల రజిని మైనస్ పాయింట్స్
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్లస్ పాయింట్స్
కుల సమీకరణలు
కమ్మ 12%
కాపు 12%
ఎస్సీ 11%
ముస్లిం 9%
బ్రాహ్మణులు 9%
రెడ్డి 7%
వడ్డెర 6%
గుంటూరు వెస్ట్ లో అన్ని రకాల సామాజికవర్గాల జనాభా దగ్గరదగ్గరగానే ఉంది. మరీ గెలుపోటములను శాసించే పొజిషన్ లో ఎవరూ లేరు. కమ్మ సామాజికవర్గంలో 30 శాతం జగన్ పార్టీకి, 65 శాతం టీడీపీ జనసేనకు, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామని సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. కమ్మ వారు టీడీపీ సంప్రదాయ ఓటర్లుగా ఉండడంతో ఆ పార్టీకే మెజార్టీ మద్దతు ఇస్తున్నట్లు తెలపగా… మరికొందరు మాత్రం వైసీపీ లీడర్లుగా ఇదే కమ్యూనిటీ నేతలు ఉండడంతో అటువైపు కూడా కొంత మంది మొగ్గు చూపుతున్నట్లుగా సర్వేలో వెల్లడైంది. ఇక కాపు సామాజికవర్గంలో 40 శాతం మంది వైసీపీకి, టీడీపీ జనసేనకు 50 శాతం, ఇతరులకు 10 శాతం మద్దతు తెలుపుతామంటున్నారు.
గుంటూరు వెస్ట్ లో పోటీ చేయబోయే విడదల రజినీ భర్త కాపు సామాజికవర్గం కావడంతో వైసీపీ కూడా ఈ వర్గం ఓట్లను బాగానే ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎస్సీల్లో 55 శాతం మంది వైసీపీకి, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి 40 శాతం, ఇతరులకు 5 శాతం సపోర్ట్ గా ఉంటామంటున్నారు. అటు ముస్లింలలో 40 శాతం జగన్ పార్టీకి, 55 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయం తెలిపారు. బ్రాహ్మణుల్లో వైసీపీకి కేవలం 25 శాతమే మద్దతు ఇస్తామని చెప్పగా, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి 65 శాతం, ఇతరులకు 10 శాతం సపోర్ట్ గా ఉంటామని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. రెడ్డి కమ్యూనిటీలో 30 శాతం వైసీపీకి, 65 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు.
ఇక వచ్చే ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ లో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…
విడదల రజిని VS ఆలపాటి రాజేంద్రప్రసాద్
YCP 44%
TDP 49%
OTHERS 7%
గుంటూరు వెస్ట్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, విడదల రజినీ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ పడితే టీడీపీ అభ్యర్థికి ఎడ్జ్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి విడదల రజినీ 44 శాతం ఓట్లు సెక్యూర్ చేసుకునే ఛాన్సెస్ ఉండగా, టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు 49 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా గుంటూరు కారం వైసీపీకి ఘాటెక్కిస్తుందని సర్వేలో జనం తమ అభిప్రాయంగా చెప్పారు.
.
.