E-Paper
Advertisement

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు, 36 మంది మృతి

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు, 36 మంది మృతి
Advertisement

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 36 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. మరో 20 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

ఉత్తరాఖండ్‌లోని అల్మోర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పౌరి నుండి రామ్‌నగర్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఆల్మోరా స్టాల్ ప్రాంతంలోకి రాగానే అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం.

Advertisement

ఘటన సమయంలో బస్సులో 45 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందగానే సహాయక చర్యలు నిమగ్నమయ్యాయి పోలీసులు టీమ్, ఏస్డిఆర్ఎఫ్ బృందాలు. గాయపడినవారిని తొలుత ట్రీట్‌మెంట్ చేశారు. అనంతరం మృతదేహాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యాయి.

బస్సు ప్రమాదంపై స్పందించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు.

Advertisement

ALSO READ: సైన్యం వ్యూహం అదుర్స్.. బిస్కెట్లతో ఉగ్రవాది హతం

అవసరమైతే తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను కోసం ఎయిర్ లిఫ్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. బస్సు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని కమిషనర్‌ని ఆదేశించిన సీఎం పుష్కర్ సింగ్ ధామి.

 

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×