BigTV English
Advertisement

Prabhas Favorite Song : నాగ్ ఎవర్ గ్రీన్ సాంగే డార్లింగ్‌కి ఫేవరెట్… ఏ పాటో తెలుసా..?

Prabhas Favorite Song : నాగ్ ఎవర్ గ్రీన్ సాంగే డార్లింగ్‌కి ఫేవరెట్… ఏ పాటో తెలుసా..?

Prabhas Favorite Song : స్టార్ హీరోల అభిమానులు వాళ్ళ అభిరుచిని సినిమాల ద్వారా తెలుసుకుంటారు. కానీ హీరోలు రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు ? అనే విషయాలను కూడా తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు. ప్రభాస్ (Prabhas) అనగానే మంచి తిండి ప్రియుడు అనే విషయం గుర్తొస్తుంది. కానీ ఆయనకిష్టమైన సినిమా ఏంటి? ఆయన ఫేవరెట్ సాంగ్ ఏంటి? అనే విషయాలు మాత్రం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. తాజాగా ప్రభాస్ తన ఫేవరెట్ సాంగ్ ఏంటి అనే విషయాన్ని వెల్లడించారు. మరి ప్రభాస్ ఎప్పుడు, ఎక్కడ ఈ విషయాన్ని బయట పెట్టారు? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.


బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘నా ఉఛ్వాసం కవనం’ అనే కార్యక్రమానికి ప్రభాస్ (Prabhas) గెస్ట్ గా విచ్చేశారు. అందులో తనకు ఇష్టమైన పాటల గురించి ప్రభాస్ వెల్లడించారు. అలాగే తనకు సిరివెన్నెల సీతారామశాస్త్రి తో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ మాట్లాడుతూ ‘సిరివెన్నెల’ సినిమాలోని విధాత తలపున ప్రభవించినది అనే పాటలో ‘సరసుస్వర’ అనే లైన్స్ అద్భుతంగా ఉంటాయంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్. అంతేకాకుండా టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) ఎవర్ గ్రీన్ సాంగ్ ఒకటి తన ఫేవరెట్ అంటూ ఈ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు.

‘నిన్నే ప్రేమిస్తా’ (Ninne Premistha) సినిమాలోని ‘కన్నుల్లో నీ రూపమే’ పాట అంటే తనకు చాలా ఇష్టమని, ఆ పాట చరణంలో వచ్చే లైన్స్ కు తను వీరాభిమానిని అంటూ సిరివెన్నెలను ఆకాశానికెత్తేశారు. ప్రతి తరానికి సరిపోయేలా పాటలు రాయడం సిరివెన్నెల గొప్పతనం, సాహిత్యానికి ప్రాధాన్యత ఉన్న పాటలు రాసిన ఆయనే ‘బోటనీ పాటముంది’ అంటూ ‘శివ’ (Shiva)లో టీజింగ్ సాంగు రాశారు అంటూ సిరివెన్నెల సాహిత్యంపై తన ఇష్టాన్ని బయట పెట్టారు. నిజానికి ఆ పాట వచ్చినప్పుడు తాను పదవ తరగతిలో ఉన్నానని, అప్పట్లో ఎక్కడ చూసినా ఆ పాటే పాడే వాడినని గుర్తు చేసుకున్నారు ప్రభాస్. అలాగే సీతారామశాస్త్రి అనగానే ‘చక్రం’ సినిమాలోని ‘జగమంత కుటుంబం’ పాట,  ‘అంకురం’ సినిమాలో ‘ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు’, ‘గమ్యం’ సినిమాలో ‘ఎంతవరకు ఎందుకు కొరకు’, ‘గాయం’ సినిమాలో ‘నిగగదీసి అడుగు’ వంటి పాటలు గుర్తొస్తాయని, సింపుల్ గా ఉండే ఈ పాటల్లో లోతైన భావం ఉంటుందని అన్నారు ప్రభాస్.


అలాగే శ్రీశ్రీ గారు (SriSri), సిరివెన్నెల (Sirivennela Sitharama Sastry) గారు రాసిన పాటలు వింటుంటే భావద్వేగానికి గురవుతామంటూ, శాస్త్రి గారి పాటలు ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతాయని సిరివెన్నెల పాటలోని గొప్పదనాన్ని వివరించారు ప్రభాస్. కాగా ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడైతే ఆయన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా షూటింగ్లో ఉన్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హర్రర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×