E-Paper
Advertisement

బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. ముఖ్యమంత్రి పీఠంపై సువేందు అధికారి?

బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. ముఖ్యమంత్రి పీఠంపై సువేందు అధికారి?
Advertisement

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. తృణమూల్ కాంగ్రెస్ అజేయ కోటను భారతీయ జనతా పార్టీ విజయవంతంగా బద్ధలు కొట్టింది. గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో ఎదురులేకుండా పాలన సాగించిన మమతా బెనర్జీకి ఓటర్లు గట్టి షాకిచ్చారు. గత రెండు పర్యాయాలుగా అందని ద్రాక్షలా ఊరించిన విజయం.. ఈసారి కమలనాథుల వశమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పక్కా ప్రణాళికలు.. పదునైన రాజకీయ వ్యూహాలు బీజేపీని విజయతీరాలకు చేర్చాయి. అమిత్ షా అన్నీ తానై నడిపించిన ఈ ఎన్నికల పోరులో బీజేపీ తిరుగులేని ఆధిక్యం సాధించింది.

తాజా ఫలితాల సరళిని గమనిస్తే బెంగాల్‌లో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. ఇప్పటి వరకు బీజేపీ 14 స్థానాల్లో విజయం సాధించగా.. ఏకంగా 183 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. మరోవైపు అధికార టీఎంసీ కేవలం 2 చోట్ల గెలిచి.. 91 స్థానాల్లో మాత్రమే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ బీజేపీ బలం పెరుగుతుండటం గమనార్హం. మమత దూకుడుకు కళ్లెం వేస్తూ గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ భారీగా ఓట్లు కొల్లగొట్టింది. అభివృద్ధి, మార్పు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ అభ్యర్థులకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు.

Advertisement

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ లభించడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అధిష్టానం సువేందు అధికారి పేరును ప్రముఖంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన.. మమతా బెనర్జీ రాజకీయాలను దీటుగా ఎదుర్కోవడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. టీఎంసీ అంతర్గత వ్యూహాలను తెలిసిన నాయకుడు కావడంతో సువేందువైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే రేసులో దిలీప్ ఘోష్, శమిక్ భట్టాచార్య వంటి సీనియర్ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. భవిష్యత్ రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేయనుంది.

ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌లో మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను కోల్‌కతా వస్తానని అప్పుడే ప్రకటించారు. ప్రధాని నమ్మకాన్ని బెంగాల్ ప్రజలు నిజం చేస్తూ భారీ తీర్పునిచ్చారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం కనిపిస్తోంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. 15 ఏళ్ల తర్వాత బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభం కానుంది.

Advertisement

ALSO READ: అమిత్ షా స్కెచ్‌.. దీదీకి చెక్..! తెలంగాణ‌లో అదే వ్యూహ‌మా…! ఇక్క‌డంత సీన్ ఉందా??

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×