E-Paper
Advertisement

బ్రేకింగ్: ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. సీఎంగా రేపే విజయ్ ప్రమాణ స్వీకారం

బ్రేకింగ్: ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. సీఎంగా రేపే విజయ్ ప్రమాణ స్వీకారం
Advertisement

తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. తన పార్టీతో పాటు మిత్రపక్షాలకు కలిపి మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని విజయ్ అధికారికంగా ప్రకటించారు. సంఖ్యాబలంపై స్పష్టత రావడంతో గవర్నర్ రాజేంద్ర ఆయనను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు. ఈ పరిణామంతో కోలీవుడ్ నుంచి కోట వరకు విజయ్ ప్రస్థానం ఒక కీలక మలుపు తిరిగింది.

రేపు ఉదయం 11 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం ఈ అపురూప వేడుకకు వేదిక కానుంది. భారీ ఎత్తున తరలివచ్చే అభిమానులు.. పార్టీ శ్రేణుల కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుండటంతో తమిళనాడు వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. సినీ రంగంలో అగ్రనటుడిగా వెలిగిన విజయ్.. ఇప్పుడు పాలనా పగ్గాలు చేపట్టడంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

Advertisement

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించనున్నారు. సోమవారం లేదా మంగళవారం నాడు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మిత్రపక్షాలైన కాంగ్రెస్, వీసీకే, డీఎండీకే వంటి పార్టీలకు కేటాయించాల్సిన పోర్ట్‌ ఫోలియోలపై కసరత్తు పూర్తయింది. కేబినెట్‌లో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సామాజిక సమీకరణాలు.. అనుభవం ప్రాతిపదికన మంత్రుల జాబితాను విజయ్ ఖరారు చేసినట్లు సమాచారం.

ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అవినీతి రహిత పాలన.. సంక్షేమ పథకాల అమలుపై విజయ్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గవర్నర్ ఆహ్వానంతో అధికారిక ప్రక్రియ ముగియగా.. ఇక పాలనపైనే అందరి దృష్టి నిలిచింది. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పొరుగు రాష్ట్రాల నేతలు.. సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

Advertisement

ALSO READ: విజయ్ సంచలన నిర్ణయం.. తాను రాజీనామా చేసిన స్థానం ఆ పార్టీకి!

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×