E-Paper
Advertisement

TVK Petition: గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. సుప్రీంకోర్టులో టీవీకే పిటిషన్.. విజయ్ వ్యూహం ఏంటి?

TVK Petition: గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. సుప్రీంకోర్టులో టీవీకే పిటిషన్.. విజయ్ వ్యూహం ఏంటి?
Advertisement

TVK Petition: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీవీకే పార్టీకి చెందిన మహిళా న్యాయవాది కె. ఎజిలరాసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించేలా చూడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

విజయ్ ని కాకుండా మరే వ్యక్తిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా నిరోధించేలా గవర్నర్ కు స్పష్టమైన సూచనలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. కాంగ్రెస్ మద్దతుతో విజయ్ కు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కె. ఎజిలరాసి పేర్కొన్నారు. మ్యాజిక్ ఫిగర్ (118 స్థానాలు)కు మరో 5 స్థానాల దూరంలోనే విజయ్ ఉన్నట్లు ఆమె కోర్టుకు తెలిపారు. అయితే మెజారిటీ నిరూపించుకునేందుకు సభ ఒక్కటే ఏకైక చట్టబద్ద ప్రదేశమని అన్నారు. కానీ నిబంధనలకు విరుద్దంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ నడుచుకున్నారని ఆమె ఆరోపించారు.

Advertisement

మే 7న ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విజయ్ కలిసినప్పుడు.. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నిరూపించుకోవాలని గవర్నర్ సూచించినట్లు ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక పార్టీని ఆహ్వానించడం మాత్రమే గవర్నర్ పాత్ర అని.. మెజారిటీ రుజువు చేయమని కోరడం ఆయన బాధ్యత కిందకు రాదని ఆమె పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్దమని పిటిషన్ లో చెప్పుకొచ్చారు. అయితే ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వీకరిస్తుందో లేదో చూడాలి.

ఇదిలా ఉంటే తమిళ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీవీకే (107)కు కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2), వీసీకే (2) పార్టీలు మద్దతు తెలపడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118) లభించింది. దీంతో రేపు ఉదయం 11 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Advertisement

Also Read: అమెజాన్‌లో పిచ్చెక్కించే సేల్.. శాంసంగ్ టాప్ ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్, స్టాక్ అయిపోయేలోపే పట్టేయండి!

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మళ్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. అయితే టీవీకే పార్టీ ముందు జాగ్రత్త చర్యగా ఈ పిటిషన్ వేసినట్లు తమిళ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకవేళ రేపు ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్ ఏమైన తిరిగి అభ్యంతరం తెలిపితే.. ముందస్తుగా వేసిన పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరవచ్చని టీవీకే పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: BSNL సంచలనం.. ఇంత తక్కువకి నెలవారీ ప్లాన్ ఆ.. అది కూడా ఇన్ని బెనిఫిట్స్‌తో..!

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×