E-Paper
Advertisement

Netflix Best Web Series 2025 : మనుషుల శరీరాలను ముక్కలు ముక్కలుగా కట్ చేసి… 2025లో ఓటీటీలో హయ్యెస్ట్ వ్యూవ్డ్ 8 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్

Netflix Best Web Series 2025 : మనుషుల శరీరాలను ముక్కలు ముక్కలుగా కట్ చేసి… 2025లో ఓటీటీలో హయ్యెస్ట్ వ్యూవ్డ్ 8 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్
Advertisement

Netflix Best Web Series 2025 : ఈ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. 2025 సంవత్సరంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ లు, అనేక అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లను తీసుకొచ్చాయి. వీటిలో అదిరిపోయే స్టోరీలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో నెట్‌ఫ్లిక్స్‌ ఒక అడుగు ముందుకు వేసి ఆధిపత్యం చెలాయించిందనే చెప్పుకోవాలి. IMDb జాబితా ప్రకారం ఈ సంవత్సరం అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 వెబ్ సిరీస్‌ల జాబితాలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ముందు వరసలో ఉంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? స్టోరీ ఎలా ఉంటుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటంటే

IMDb టాప్ 10లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ వెబ్ సిరీస్ గా వాణి కపూర్ నటించిన “మండలా మర్డర్స్” చోటు దక్కించుకుంది. 2025 జూలై 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కి ప్రేక్షకులు పూర్తిగా ఫిదా అయిపోయారు. ఇది ఎనిమిది ఎపిసోడ్‌లలో ఉత్కంఠభరితమైన కథను అందించింది. YRF ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో గోపీ పుత్రన్ దీనిని రూపొందించారు. ఇందులో వాణి కపూర్, వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా, శ్రియా పిల్గావ్కర్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Read Also : వరుస హత్యలకు గురయ్యే క్రిమినల్స్ … టీచర్ కి లింకు… ఓటిటిలోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

ఉత్తరప్రదేశ్‌లోని ఫిక్షనల్ టౌన్ చరందాస్‌పూర్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలు సంచలనం సృష్టిస్తాయి. సీఐబీ ఆఫీసర్ రియా థామస్ (వాణి కపూర్) సస్పెండెడ్ కాప్ విక్రమ్ సింగ్ (వైభవ్ రాజ్ గుప్తా) ఈ రిచ్యువల్ మర్డర్స్‌ను ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఈ మర్డర్స్ వెనుక ఏయాస్టిస్ అనే సీక్రెట్ కల్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. వీళ్ళు మాన్ మేడ్ గాడ్ యస్త్‌ను సృష్టించడానికి, పర్ఫెక్ట్ హ్యూమన్ బాడీ పార్ట్స్ ను సేకరిస్తారు. 1950లలో ఫెయిల్ అయిన రిట్యువల్‌ను ప్రజెంట్ లో అనన్య భరద్వాజ్ (సుర్వీన్ చావ్లా) లీడ్ చేస్తుంది. పాలిటిక్స్, మిథాలజీ మిక్స్ తో ఈ కథ సస్పెన్స్ పెంచుతుంది. క్లైమాక్స్‌లో రియా, విక్రమ్ కల్ట్ రహస్యాలను బయటపెడతారు. అయితే విక్రమ్ ఫైనల్ సాక్రిఫైస్‌గా ఎంపిక అవుతాడు. అనన్య కల్ట్ లీడర్ అని తెలుస్తుంది. రియా ఎంతో కష్టపడి ఆ రిచ్యువల్ ఆపుతుంది. కానీ కల్ట్ ఇంకా పూర్తిగా నాశనం కాలేదని చూపిస్తూ సీజన్ 2కి హింట్ ఇస్తుంది.

Advertisement

 

 

 

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×