E-Paper
Advertisement

OTT Movie : ఈ ఏడాది జీ 5లో హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టిన టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే

OTT Movie : ఈ ఏడాది జీ 5లో హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టిన టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే
Advertisement

OTT Movie : ఈ సంవత్సరం బిగ్ స్క్రీన్ మీదకి ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. కామెడీ డ్రామాల నుండి థ్రిల్లర్‌ల వరకు అనేక సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కొన్ని విజయాలు, మరికొన్ని అపజయాలు మూటగట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలు ఓటీటీలో కూడా క్రేజ్ తెచ్చుకుంటూ, తమదైన ముద్ర వేశాయి. 2025 రెండు వారాల్లో ముగియనున్నందున, ZEE5లో హయ్యెస్ట్ వ్యూస్ తో నడుస్తున్న టాప్ 10 సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

‘సంక్రాంతికి వస్తున్నాం’

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ తెలుగు యాక్షన్ కామెడీ మూవీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందింది. థియేటర్లలో ఇది బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. ZEE5లో హయ్యెస్ట్ వ్యూస్ తో టాప్ లో ఉంది. ఇందులో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ భార్యతో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్న రిటైర్డ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. ఒక హై ప్రొఫైల్ కిడ్నాప్ కేసును ఛేదించడానికి అతను అయిష్టంగానే తిరిగి యాక్షన్‌లోకి అడుగు పెడతాడు. దీంతో స్టోరీ కామెడీ, యాక్షన్‌ సీన్స్ తో పరుగులు పెడుతుంది.

కుటుంబస్థాన్

Advertisement

మణికందన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ సినిమా రాజేశ్వర్ కాళిసామి దర్శకత్వంలో తెరకెక్కింది. మధ్యతరగతి కుటుంబ భారాల ఒత్తిడిని తట్టుకుంటూ, అనుకోకుండా ఉద్యోగం కోల్పోయిన ఒక యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ కామెడీ డ్రామాలో సాన్వే మేఘన, గురు సోమసుందరం, సుందరరాజన్ తదితరులు నటించారు. మణికందన్ సహజ నటన, కామెడీ టైమింగ్ కి ప్రశంసలు కూడా వచ్చాయి.

ఐడెంటిటీ

అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ లో టోవినో థామస్, త్రిష కృష్ణన్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఒక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. దీనిలో హంతకుడి ముఖాన్ని గుర్తించేందుకు ఒక స్కెచ్ ఆర్టిస్ట్‌ను నియమించుకుంటారు. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది.

శ్రీమతి

Advertisement

హిందీ వెర్షన్‌లో సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, మలయాళ చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్ కి రీమేక్. కొత్తగా కొత్తగా పెళ్లైన ఒక మహిళ తన అత్తమామల ఇంటి బాధ్యతలన్నింటినీ మోయడమే కాకుండా, పురుషాధిపత్యంతో వచ్చే కష్టాలను ఎదుర్కొంటుంది. ఆరతి కడవ్ దీనికి దర్శకత్వం వహించారు.

అజ్ఞాతవాసి

ఈ కన్నడ క్రైమ్ మూవీకి జనార్ధన్ చిక్కన్న దర్శకత్వం వహించారు. ఇందులో రంగాయణ రఘు, పావన గౌడ, సిద్దు మూలిమాని, శరత్ లోహితాశ్వ, రవిశంకర్ గౌడ్ వంటి నటులు నటించారు. ఈ చిత్రం 1990ల నాటి నేపథ్యంలో సాగుతుంది. ఒక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వీటితో పాటు కిష్కింధపురి, మామన్, జానకి V vs స్టేట్ ఆఫ్ కేరళ, ఎలుమలే, లాగ్అవుట్ వంటి సినిమాలు కూడా ZEE5 టాప్ 10 లిస్ట్ లో ఉన్నాయి.

Read Also : ఆంటీ అరాచకం అమ్మాయిలు అంతకుమించి… ఇది అంతుచిక్కని కథ

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×