E-Paper
Advertisement

56 Days Thriller Series OTT : డవ్ కామెరూన్, అవాన్ జోగియా నటించిన థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి… 8 ఎపిసోడ్‌లలో పిచ్చెక్కించే ట్విస్టులు

56 Days Thriller Series OTT : డవ్ కామెరూన్, అవాన్ జోగియా నటించిన  థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి… 8 ఎపిసోడ్‌లలో పిచ్చెక్కించే ట్విస్టులు
Advertisement

56 Days Thriller Series OTT : మరో ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ’56 డేస్’ అనే ఈ ఎనిమిది ఎపిసోడ్‌ల హాలీవుడ్ సిరీస్, ఇప్పుడు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ 2021లో అత్యధికంగా అమ్ముడైన కేథరీన్ ర్యాన్ హోవార్డ్ నవల ఆధారంగా రూపొందింది. ఒక ప్రేమకథ ఊహించని మలుపులతో భయంకరమైన థ్రిల్లర్ మోడ్ కి వెళ్తుంది. ఇది సస్పెన్స్ తో నడిచే సిరీస్‌గా మంచి రెస్పాన్స్ పొందుతోంది. థ్రిల్లర్‌ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. దీనిని ఎక్కడ చూడచ్చు ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

డవ్ కామెరాన్, అవాన్ జోగియా ప్రధాన పాత్రల్లో నటించిన ’56 డేస్’ (56 Days) చిత్రం బోస్టన్ నేపథ్యంలో సాగే ఒక థ్రిల్లర్ సిరీస్. ప్రముఖ హర్రర్ చిత్రాల దర్శకుడు జేమ్స్ వాన్ దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అమెజాన్ MGM స్టూడియోస్ నిర్మాణంలో ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లు 2026 ఫిబ్రవరి 18న ఒకేసారి విడుదలయ్యాయి. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అన్ని ఎపిసోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సియారా, ఆలివర్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక సూపర్ మార్కెట్‌లో అనుకోకుండా పరిచయమై, ఒకరినొకరు ఇష్టపడతారు. పరిచయమైన కొద్దిరోజులకే వాళ్ళు కలిసి ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంటారు. అయితే ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు. వారిద్దరి గతం వెనుక కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి. సరిగ్గా 56 రోజుల తర్వాత, ఆలివర్ అపార్ట్‌మెంట్‌లోని బాత్‌టబ్‌లో ఒక మృతదేహం బయటపడటంతో కథలో అసలైన ఉత్కంఠ మొదలవుతుంది. అసలు ఆ చనిపోయింది ఎవరు? సియారా లేదా ఆలివర్‌లలో ఎవరైనా హంతకులా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.

ఇక ఈ సిరీస్ రెండు కాలాల్లో నడుస్తుంది. ఒకవైపు ఆ 56 రోజుల్లో వాళ్ళ మధ్య ప్రేమ కథ. ఆ సమయంలో ఏం జరిగింది అనేది చూపిస్తూనే, మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న హత్య విచారణను ఆసక్తికరంగా చూపిస్తారు. ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త సెక్రెట్ బయటపెడుతూ, వీరిద్దరిలో ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో అన్న సస్పెన్స్‌తో సాగుతుంది. ఆ మృతదేహం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి ? ఆ 56 రోజుల్లో వారి జీవితాలు ఎలా మారిపోయాయి అనేదే ఈ ’56 డేస్’ ప్రధాన కథాంశం.

Advertisement

Read Also :  గతం మరిచిపోయే భార్య… భర్త ఇచ్చే షాకింగ్ ట్విస్టులు… ఊహించని మలుపులతో చెమటలు పట్టించే స్టోరీ

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×