E-Paper
Advertisement

KTR: బడ్జెట్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

KTR: బడ్జెట్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

KTR: తెలంగాణ బ్యూరో, స్వేచ్చ: రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర ఏళ్ళు అవుతుందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 95% పెండింగ్ లో ఉన్నాయని ఈ బడ్జెట్ లో నైనా వాటి అమలుకు నిధులు కేటాయించాలి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి గురువారం బహిరంగ లేఖ రాశారు. హామీలను అమలు చేయకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపిక పట్టే ప్రసక్తే లేదని గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీ ల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి వాటి అమలును పక్కన పెట్టారని ఆరోపించారు.

ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలి 

రెండు బడ్జెట్లలో హామీల అమలు కోసం కేటాయింపులు చేయని ప్రభుత్వం ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలో హామీ ఇచ్చిన మహిళలు, వృద్ధులు, విద్యార్థి, యువత, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. డిక్లరేషన్ ల పేరుతో హామీలు ఇచ్చిన మేరకు ఎస్సీ, బీసీ, ఎస్టీ,మైనార్టీలకు బడ్జెట్లో ప్రాధాన్య ఇవ్వాలని, ఆయా వర్గాలకు రెండు సంవత్సరాలుగా ఎగ్గొట్టిన హామీలను.. కాంగ్రెస్ ఇస్తామని చెప్పిన నిధుల బకాయిలను ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయాలని కోరారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని నిలబెట్టుకోవాలని సూచించారు.

Also Read: Collector Hanumantha Rao: పాఠశాలల్లో సివిల్ వర్క్స్ పనులను మార్చి, 15 వరకు పూర్తి చేయాలి : కలెక్టర్ హనుమంతరావు

ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తాం 

హామీల అమలుకు నిధులు కేటాయించకుండా ప్రజల తరఫున ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. 2026-27 బడ్జెట్లో 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే ఎక్కడికి అక్కడ కాంగ్రెస్ ను ప్రజల పక్షాన నిలదీస్తామని హెచ్చరించారు. వృద్ధులు, వితంతువులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4000 పెంచడానికి ఎన్ని నిధులు కావాలో లెక్క గట్టి పైసలు ఈసారి బడ్జెట్లో కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

రైతుల ఖాతాలో నిధులు జమ చేయాలి 

రాష్ట్ర జనాభాలో సగభాగంగా ఉన్న ప్రతి ఒక్క మహిళకు మహాలక్ష్మి కింద నెలకు 2500 అందజేస్తామని హామీ ఇచ్చి 25 నెలలు గడిచిపోయిన ఇప్పటివరకు ఒక లబ్ధిదారుకు ఒక్క పైసా దక్కలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో గ్యారంటీల అమలుకు అడుగు పడకపోతే ఆడబిడ్డలు ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రైతుబంధును 15 వేలకు పెంచుతామని మాట ఇచ్చి మోసం చేసినందుకు ముందు క్షమాపణలు చెప్పాలని ఆ మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించాలని అన్నదాతల పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు పెండింగ్లో పెట్టిన రైతుబంధు పాత బకాయిలను కూడా చెల్లించాలని, కౌలు రైతులకు రైతు కూలీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వారి ఖాతాలో నిధులు జమ చేయాలని కోరారు.

జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ భృతి

తొలి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీతో పాటు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు కూడా బడ్జెట్లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయి రోడ్డుపై పడ్డ ఆటో డ్రైవర్ ఇస్తానన్న ఆర్థిక సహాయం అందజేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం పనికిరాని అంశాలను తెరపైకి తెచ్చి ప్రతిసారి అటెన్షన్ డైవర్ట్ చేయాలని చేస్తున్న కుట్రలు తెలంగాణ సమాజానికి అర్థమయిపోయాయన్నారు. ఢిల్లీ నేతల సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేయడమే కాకుండా చివరికి ఇంటింటికి గ్యారెంటీ కార్డులను కూడా పంపిణీ చేసి ఇన్నేళ్లపాటు దగా చేయడానికి తెలంగాణ సమాజం సహించదన్నారు. నాటి గ్యారెంటీ కార్డులే ఇవాళ బాకీ కార్డు లై ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తున్నాయన్నారు.

ప్రతి నెల 4 నిరుద్యోగ భృతి చెల్లిస్తాం

హైదరాబాద్ యూత్ డెకరేషన్ లో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ మాట మార్చి 5 ఏళ్లలో భర్తీ చేస్తామని పేర్కొనడం నిరుద్యోగ యువత గొంతు కోయడమే అన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెల 4 నిరుద్యోగ భృతి చెల్లిస్తాం అన్న వాగ్దానాన్ని పూర్తిగా గంగలో కలిపి ఇప్పటి వరకు నయా పైసా కూడా చెల్లించకుండా యువతను మోసగించారన్నారు. కేసిఆర్ హయాంలో నియామక ప్రక్రియ పూర్తి చేసిన వాటికి కాగితాలు ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం అత్యంత దారుణం అన్నారు. ఈ బడ్జెట్లో మరోసారి ఆరు గారంటీలు 4260 హామీలు డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజాగ్రహానికి గురై ముఖ్యమంత్రితో పాటు మంత్రులు తిరగలేరని స్పష్టం చేశారు.

Also Read: Solar AC in India: సోలార్ ఏసీ వల్ల లాభాలేమిటీ? ఎంత ఖర్చవుతుంది? కరెంట్ బిల్లు తగ్గుతుందా!

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×