E-Paper
Advertisement

Dhurandhar 2: దురంధర్ లాగా కాదు.. దురంధర్ 2లో పెద్ద మార్పు ప్లాన్ చేసిన మేకర్స్..!

Dhurandhar 2: దురంధర్ లాగా కాదు.. దురంధర్  2లో పెద్ద మార్పు ప్లాన్ చేసిన మేకర్స్..!
Advertisement

Dhurandhar 2: బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ధురంధర్ 2. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తిచేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు UA 16+ సర్టిఫికెట్ మంజూరు చేసింది. దీంతో సినిమా థియేటర్లలో విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మేకర్స్ అధికారికంగా మార్చి 19న ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించారు. ఈ సినిమా మొదటి భాగానికి ఏ సర్టిఫికెట్ రాగా.. ఇప్పుడు రెండో భాగానికి యూఏ వచ్చేటట్టు టీం ప్లాన్ చేసుకోవడం వల్ల.. ఇది ఈ చిత్రానికి ప్లస్ అవ్వచ్చని అందరూ భావిస్తున్నాడు

ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా రణవీర్ సింగ్ నటించారు. మొదటి భాగమైన ధురంధర్ మంచి విజయం సాధించడంతో, రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం, ధురంధర్ 2 రన్‌టైమ్ 208 నిమిషాలుగా ఉండబోతోంది. అంటే దాదాపు మూడు గంటల 28 నిమిషాల పాటు సినిమా సాగనుంది. ఇది మొదటి భాగంతో పోలిస్తే కొద్దిగా తక్కువ సమయం ఉండొచ్చని తెలుస్తోంది.

Advertisement

కథ విషయానికి వస్తే.. మేకర్స్ ఇంకా పూర్తి వివరాలను బయటపెట్టలేదు. అయితే అధికార పోరాటం, ప్రతీకారం, విశ్వాసం వంటి అంశాలు కథలో ప్రధానంగా ఉంటాయని సమాచారం. రెహ్మాన్ డకాయిట్ మరణం తర్వాత హమ్జా అలీ మజారి ఎలా ఎదిగి “షేర్-ఏ-బలోచ్”గా మారాడు అనే కోణంలో కథ సాగుతుందని టాక్.

ఈ సినిమాలో యామి గౌతమ్ ఒక కీలక అతిథి పాత్రలో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఓ రహస్య గూఢచారి పాత్రలో నటిస్తుందని సమాచారం. అలాగే ఆర్. మాధవన్, సారా అర్జున్ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. వీరి పాత్రలు కథకు మరింత బలాన్ని ఇస్తాయని భావిస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా, సినిమా షూటింగ్ సమయంలో భద్రతా నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. నిర్మాత సంస్థపై బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. నిషేధిత పదార్థాలు వాడినట్లు ఫిర్యాదులు రావడంతో జరిమానా విధించినట్లు సమాచారం. అయినప్పటికీ, ఈ వివాదాలు సినిమాపై ఉన్న క్రేజ్‌ను మాత్రం తగ్గించలేకపోయాయి.

భారీ తారాగణం, పొడవైన రన్‌టైమ్, యాక్షన్‌తో నిండిన కథతో ధురంధర్ 2 ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశమైన సినిమాల్లో ఒకటిగా నిలవనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ: Telangana Gaddar Film Awards: జ్యూరీ కమిటీ ఛైర్మన్ మార్పు.. ఇప్పుడెవరంటే?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×