E-Paper
Advertisement

OTT Movie : పోలీసు శాఖను కుదిపేసే వరుస హత్యలు… ఫ్యూజులు అవుటయ్యే ట్విస్టులున్న సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : పోలీసు శాఖను కుదిపేసే వరుస హత్యలు… ఫ్యూజులు అవుటయ్యే ట్విస్టులున్న సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : సస్పెన్స్ తో సాగే సీరియల్ కిల్లర్ సినిమాలు చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంటాయి. ఆడియన్స్ కూడా సీట్ ఎడ్జ్ వరకూ చేరుకొని ఈ సినిమాలను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక కన్నడ సినిమా, వరుస హత్యలతో ఊహించని ట్విస్టులు ఇస్తోంది. ఈ సినిమా ఎస్. నారాయణ్ దర్శకత్వం వహించిన 50వ చిత్రం కాగా, నటుడు ఆదిత్య నటించిన 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ సక్సెస్ అయింది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

‘5D’ 2024లో విడుదలైన కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. S. నారాయణ్ దర్శకత్వంలో వన్ టు హండ్రెడ్ బ్యానర్‌పై స్వాతికుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఆదిత్య, అదితి ప్రభుదేవా, జ్యోతి రాయ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2024 ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఐయండిబిలో 7.0/10 రేటింగ్ ని కూడా సాధించింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

బెంగళూరులో క్రూరమైన వరుస హత్యలు కర్ణాటక పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను షేక్ చేస్తుంది. మొదటి విక్టిమ్ ఒక బిజినెస్‌ మ్యాన్ గొంతు కోసి చంపబడతాడు. రెండోది ఒక జర్నలిస్ట్ కారు మంటల్లో చిక్కుకొని కాలిపోతాడు. మూడోది ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ హోటల్ రూమ్‌లో హ్యాంగ్ అయి కనిపిస్తాడు. అందరి డెత్ సీన్‌లో ఒక రెడ్ రిబ్బన్ దొరుకుతుంది. ఒకే నంబర్ నుంచి మిస్డ్ కాల్స్, ఒకే వాట్సాప్ గ్రూప్ “5D” ఉండటంతో CCB ఆఫీసర్ విక్రమ్ కేసు టేకప్ చేస్తాడు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్, CCTV, ఫోన్ డేటా ద్వారా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అతని సోదరి 5 ఏళ్ల క్రితం మిస్టీరియస్‌గా అదృశ్యమైన బ్యాక్‌ స్టోరీతో పర్సనల్ మోటివ్ కూడా జత అవుతుంది.

Read Also : భర్తను చంపడానికి ఇద్దరమ్మాయిల ప్లాన్.. అన్ ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు, థ్రిల్లింగ్ టర్న్స్ ఉన్న కొరియన్ క్రైమ్ డ్రామా

Advertisement

ఫ్లాష్‌ బ్యాక్‌లలో విక్టిమ్స్ డార్క్ సీక్రెట్స్ బయటపడతాయి. ఒక బిజినెస్‌ మ్యాన్ భార్యను మోసం చేసి సూసైడ్‌కు దారి తీస్తాడు. జర్నలిస్ట్ ఫేక్ న్యూస్ రాసి ఒక ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ బ్లాక్‌మెయిల్‌తో డబ్బు సంపాదిస్తాడు. విక్రమ్ తన టీమ్‌తో కలిసి కిల్లర్ ఐడెంటిటీ, “5D” గ్రూప్ మోటివ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. క్లైమాక్స్‌లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌తో కిల్లర్ ఎవరో రివీల్ అవుతుంది. ఇంతకీ ఈ సీరియల్ కిల్లర్ ఎవరు ? ఎందుకు వీళ్ళను చంపుతున్నాడు ? విక్రమ్ సోదరికి, ఈ హత్యలకు సంబంధం ఉందా ? అనే విషయాలను, ఈ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

 

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×