E-Paper
Advertisement

Konda Surekha: మంత్రి కొండా సురేఖ.. అర్థరాత్రి ఎందుకలా? వివాదానికి ముగింపు?

Konda Surekha: మంత్రి కొండా సురేఖ.. అర్థరాత్రి ఎందుకలా? వివాదానికి ముగింపు?
Advertisement

Konda Surekha: మంత్రి కొండాసురేఖ తన మనసులోని బాధను మరోసారి వ్యక్తంచేశారు. నటుడు నాగార్జున-ఆయన కుటుంబంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరోసారి ఎక్స్ వేదికగా మనసులోని మాట బయటపెట్టారు. నాగ్‌ ఫ్యామిలీని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. వారు బాధపడి ఉంటే తాను చింతిస్తున్నానని  రాసుకొచ్చారు.

అర్థరాత్రి కొండా సురేఖ వివరణ

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నేతల్లో మంత్రి కొండా సురేఖ ఒకరు. ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లోకి వస్తున్నారు. అఫ్‌కోర్సు..  అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. ఏ విషయమైనా ముఖం మీద మాట్లాడుతారు. అందులో ఎలాంటి దాపరికాలు ఉండవు. ఆ ఆలోచన మంచిదే.. కాకపోతే ఇబ్బందులు తెచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇటీవల నాగార్జున ఫ్యామిలీపై ఆమె చేసిన కామెంట్స్ ఇంకా చర్చ జరుగుతోంది. ఏమనుకున్నారో తెలీదుగానీ బుధవారం అర్థరాత్రి తన మనసులోని మాటను వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ. నటుడు నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని ఉద్దేశం తనకు లేదని మరోసారి స్పష్టం చేశారు.

Advertisement

బాధపెట్టాలని ఉద్దేశం తనకు లేదు-సురేఖ

నా ప్రకటన వారి గురించి ఏదైనా అనాలోచిత అభిప్రాయం ఉంటే, తాను చింతిస్తున్నానని, దాన్ని ఉపసంహరించుకుంటానని పేర్కొన్నారు. మంగళవారం అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఆమెపై నాగార్జున వేసిన పరువునష్టం కేసు న్యాయస్థానంలో కొనసాగుతోంది. దీనిపై నటుడు నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

అక్కినేని నాగచైతన్య-సమంత విడిపోవడానికి కేటీఆర్‌ కారణమంటూ మంత్రి కొండా సురేఖ కొన్నాళ్ల కిందట చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలుసు. ఆమె వ్యాఖ్యలను నాగార్జున ఫ్యామిలీ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంలో ఫిల్మ్ ఇండస్ట్రీ సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఆమె వ్యాఖ్యలపై న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు.

ALSO READ: సైలెంట్ మూడ్‌లో ఖమ్మం నేతలు, మేటరేంటి?

ఇప్పటికే ఇటు నాగార్జున, నాగచైతన్య స్టేట్‌మెంటులను రికార్డు చేసింది.  అటు మంత్రి కొండా సురేఖ కూడా కోర్టుకు వెళ్లారు. ఆ వ్యవహారం తర్వాత మీడియా ముఖంగా నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పారు. తాజాగా ఎక్స్ వేదికగా మరోసారి క్షమాపణలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై న్యాయస్థానంలో వేసిన కేసును నాగార్జున వెనక్కి తీసుకుంటారా? లేదా అన్నది చూడాలి. ఎందుకంటే పశ్చాత్తాపానికి మించినది మరొకటి ఉండదు.

 

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×