Jagan In Hyderabad: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మళ్లీ వివాదానికి కేంద్ర బిందువు అయ్యారా? దాదాపు ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టులో అడుగుపెడుగుతున్నారా? తాను ముఖ్యమంత్రి అనే భ్రమల్లో ఆయన ఉన్నారా? తన టూర్ షెడ్యూల్ విడుదల చేశారా? కేవలం న్యాయస్థానానికి గంట మాత్రమే సమయం కేటాయించారా? ఆస్తుల కేసులో నిందితుడి న్యాయస్థానానికి సమయం ఇవ్వడం ఏంటన్నది న్యాయవాదుల మాట. ఈ విధంగా మాజీ సీఎం ఇరుకున పడ్డారా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.
అక్రమాస్తుల కేసులో 2020 జనవరి 10న చివరిసారి సీబీఐ కోర్టుకి హాజరయ్యారు జగన్. చాన్నాళ్ల తర్వాత అంటే.. దాదాపు ఆరేళ్ల తర్వాత గురువారం సీబీఐ న్యాయస్థానం ముందు హాజరవుతున్నారు. సుదీర్ఘకాలంగా బెయిల్ పై ఉన్న ఆయన, న్యాయస్థానం ఆదేశాలతో చివరకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు అధికార హోదాను అడ్డం పెట్టుకుని న్యాయస్థానంలో అడుగుపెట్టలేదు.
దీని కారణంగా కోర్టు నుంచి రిలీఫ్ పొందారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. అయినా సరే అక్రమాస్తుల కేసులో న్యాయస్థానం ముందు హాజరు కాకుండా వాయిదాలతో సరిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ కేసులో అన్నిదారులు మూసుకుపోవడంతో స్వయంగా గురువారం న్యాయస్థానం ముందు హాజరవుతున్నారు మాజీ సీఎం జగన్. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో తన టూర్ షెడ్యూల్‌ని విడుదల చేసేవారు.
ప్రస్తుతం ఆయన మాజీ సీఎం. తన హైదరాబాద్ టూర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఏ గంటకు ఏం చేస్తారో అందులో క్లియర్‌గా ప్రస్తావించారు. ఇందులో పెద్దగా మేటర్ ఏమీ లేదు. కాకపోతే కేవలం గంట మాత్రమే న్యాయస్థానానికి సమయం కేటాయించారు. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు మాత్రమే కోర్టులో ఉంటానని చెప్పే ప్రయత్నం చేశారు.
ఆ షెడ్యూల్‌ని చూసి రాజకీయ నేతలు, అడ్వకేట్లు షాకయ్యారు. ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్, న్యాయస్థానానికి గంట సమయం కేటాయించడం ఏంటంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నార్మల్‌గా కోర్టు వ్యవహారాలు వచ్చేసరికి అక్కడ సమయం ఎంతపడుతుందో ఎవరికీ తెలీదు.
కోర్టు సమయం ఉదయం పదిన్నరకు మొదలవుతుందని, పాత కేసు కావడంలో ఆయన్ని ముందు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఆ సమయానికి ఆయన అక్కడ ఉండాలని, లేకుంటే న్యాయమూర్తి ఆ కేసును సైడు పెట్టే ఛాన్స్ ఉంది. రాజకీయ నేతలు మాత్రం న్యాయస్థానాన్ని జగన్ బెదిరిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి గురువారం రోజు న్యాయస్థానంలో ఎంతసేపు జగన్ ఉంటారో వెయిట్ అండ్ సీ.
నేడు 16 నుండి 47 వరకూ కేసులు అన్నీ జగన్ వే.. అన్ని కేసులకూ కలిపి కోర్టుకి ఒక గంట సమయం కేటాయించిన జగన్.
మరి కోర్టులో అన్ని కేసులకు సంబంధించి గంట సమయం సరిపోతుందా? జగన్ సాయంత్రం వరకూ వేచి ఉండాల్సిన అవసరం వస్తుందా? pic.twitter.com/dSAf30XqOj
— Swathi Reddy (@Swathireddytdp) November 20, 2025