E-Paper
Advertisement

OTT Movie : సైకో గ్యాంగ్ అరాచకం… థియేటర్ల నుంచి పరుగులు పెట్టిన జనం… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ

OTT Movie : సైకో గ్యాంగ్ అరాచకం… థియేటర్ల నుంచి పరుగులు పెట్టిన జనం… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ
Advertisement

OTT Movie : ఎక్స్‌ట్రీమ్ వయలెన్స్ తో కొన్ని సినిమాలు వస్తుంటాయి. వాటిని ఆడియన్స్ కూడా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే 1971లో రిలీజ్ అయినప్పుడు ఒక మూవీ భయంకర కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. చాలా దేశాల్లో దీని మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. UKలో ఈ సినిమాని దర్శకుడే స్వయంగా 2000వ సంవత్సరం వరకు బ్యాన్ చేయించాడు. దర్శకుడే ఇలా చేసాడంటే కంటెంట్ ఎంత ఘోరంగా ఉంటుందో ఇట్టే అర్థం అవుతుంది. ఇందులో చాలా డిస్టర్బింగ్ సీన్స్ ఉన్నాయి. సెన్సిటివ్ మైండెడ్ వాళ్లు దీనిని చూడకపోవడమే మంచిది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

స్టాన్లీ క్యూబ్రిక్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ బ్రిటిష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఎ క్లాక్‌వర్క్ ఆరెంజ్’. 1971లో వచ్చిన ఈ సినిమా, ఆంథోనీ బర్జెస్ 1962 నవల ఆధారంగా తీశారు. ఇందులో మాల్కమ్ మెక్‌డౌవెల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video, Apple TVలో అందుబాటులో ఉంది. 136 నిమిషాల ఈ మూవీ ఐయండిబీలో 8.3/10 రేటింగ్ పొందింది. ఆస్కార్‌లో ఈ సినిమాకి 4 నామినేషన్స్ కూడా వచ్చాయి.

Advertisement

Read Also : తమ్ముడి హత్య కేసులో అన్న ఇన్వెస్టిగేషన్… మైండ్ బ్లాక్ చేసే మలయాళం థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

అలెక్స్ అనే 16 ఏళ్ల టీనేజ్ అబ్బాయి అమ్మానాన్నతో కలసి ఉంటాడు. కానీ వాళ్ళు అతన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వళ్ళ, రోజు స్కూల్ బంక్ కొట్టి, రాత్రి పూట తన గ్యాంగ్ తో కలిసి రోడ్డు మీద తిరుగుతాడు. వీళ్లకి వయలెన్స్ అంటే పిచ్చి. ఎవడైనా ఒంటరిగా కనిపిస్తే గుంపుగా దాడి చేసి కొట్టి, వాళ్ళ వస్తువులను లాక్కుని పైశాచిక ఆనందం తీర్చుకుంటారు. అమ్మాయిలను దారుణంగా వేధిస్తుంటారు. ఒక రాత్రి ఒక ఓల్డ్ మనిషిని కొట్టి, మరో గ్యాంగ్‌తో గొడవ పడి, ఆ తర్వాత ఒక రైటర్ ఇంట్లోకి దూరతారు. రైటర్ భార్యపై భర్త కళ్ళముందే దారుణంగా అఘాయిత్యం చేస్తారు. మరో రాత్రి ఒక రిచ్ లేడీ ఇంట్లోకి దూరి ఆమెను కూడా అలాగే చేసి చంపేస్తారు. ఆ గ్యాంగ్‌లో గొడవ వచ్చి, అలెక్స్ ను దోషిని చేసి జైలుకు పంపిస్తారు. జైల్లో రెండేళ్లు గడిచాక ప్రభుత్వం ఒక కొత్త ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంది. రెండు వారాల్లో క్రిమినల్స్‌ను మంచోళ్లు చేస్తామని డబ్బా కొడుతుంది. అలెక్స్ దానికి వాలంటీర్ అవుతాడు.

Advertisement

ట్రీట్‌మెంట్ ఏంటంటే, అలెక్స్ కళ్లు బలవంతంగా తెరిచి పెట్టి, రోజంతా నాన్‌స్టాప్ హిట్లర్ వీడియోలు, హింసాత్మక వీడియోలు చూపిస్తారు. అదే టైంలో డ్రగ్స్ ఇంజెక్షన్ ఇచ్చి వాంతులు చేసుకునేలా చేస్తారు. ఫలితం ఏంటంటే, ఇకపై వయలెన్స్ గురించి ఆలోచిస్తే అలెక్స్‌కి భయంకరమైన తలనొప్పి, వాంతులు వస్తాయి. అతను ఏం చెయ్యాలనుకున్నా శరీరం సహకరించదు. ఈ పరీక్షల అనంతరం అలెక్స్ క్యూర్ అయ్యాడని ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే స్టోరీ మరోలా మలుపు తీసుకుంటుంది. క్లైమాక్స్ షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? అలెక్స్ నిజంగానే మారిపోతాడా ? మరిన్ని హింసలకు పాల్పడతాడా ? అనే విషయాలను ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×