E-Paper
Advertisement

OTT Movie : తమ్ముడి హత్య కేసులో అన్న ఇన్వెస్టిగేషన్… మైండ్ బ్లాక్ చేసే మలయాళం థ్రిల్లర్

OTT Movie : తమ్ముడి హత్య కేసులో అన్న ఇన్వెస్టిగేషన్… మైండ్ బ్లాక్ చేసే మలయాళం థ్రిల్లర్
Advertisement

OTT Movie : మలయాళం థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మలయాళం సినిమాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది మమ్మూట్టి, మోహన్ లాల్. వీళ్ళు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కూడా తమదైన ముద్ర వేసుకున్నారు. వీళ్ళ సినిమాలు తెలుగులో కూడా తప్పకుండా రిలీజ్ చేస్తుంటారు. అయితే మమ్మూట్టి సోదరుడి కుమారుడు ఆష్కర్ సౌదాన్ లీడ్ రోల్‌లో నటించిన ఒక థ్రిల్లర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఈ ఏడాది థియేటర్లలో విడుదల అయింది. అయితే దీనికి ఆడియన్స్ నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు. ఓటీటీలో ఫర్వాలేదనిపించిది. తమ్ముడి మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే అన్న చుట్టూ ఈ స్టోరీ ఉంటుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ ఓసారి చూడవచ్చు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ది కేస్ డైరీ’ (The Case Diary) 2025 లో వచ్చిన మలయాళ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దిలీప్ నారాయణన్ దర్శకత్వంలో, ఏ.కె. సంతోష్ రచించిన ఈ చిత్రాన్ని కె.వి. అబ్దుల్ నాసర్ బెంజీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 21న థియేటర్స్‌లో విడుదలైంది. ఇంటర్‌స్టేట్ రాబరీ గ్యాంగ్ కేసు, ట్విన్ బ్రదర్ మరణం మధ్య జరిగే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ ని పొందింది. ప్రస్తుతం ఈ సినిమా Manorama Max ప్లాట్‌ఫాంమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : దుబాయ్ లో దూకుడు పెంచే అమ్మాయిలు… 10 నిమిషాలకో హాట్ సీన్… ఒంటరిగా చూడాల్సిన మూవీ

స్టోరీ ఏమిటంటే

కేరళలోని ఒక అనాధాశరణాలయంలో అజు, సామ్ అనే ఇద్దరు ట్విన్ బేబీస్ ఉంటారు. వీళ్ళను వేర్వేరు వాళ్లకు దత్తత ఇవ్వడం జరుగుతుంది. అజు ఒక సాధారణ క్రిస్టియన్ ఫ్యామిలీలో పెరుగుతాడు. సామ్‌ను రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సామ్ కోషీ దత్తత తీసుకుని పోలీసు ఆఫీసర్‌గా పెంచుతాడు. పెద్దయ్యాక సామ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుతాడు. ఒక రోజు తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో భారీ బంగారు విగ్రహాల దొంగతనం జరుగుతుంది. ఇది ఇంటర్‌స్టేట్ రాబరీ గ్యాంగ్ పని అని తెలిసి సామ్‌ను అక్కడికి పంపిస్తారు. శ్రీరంగంలో ఉన్నప్పుడు సామ్‌కి తన ట్విన్ బ్రదర్ అజు రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయాడనే షాకింగ్ న్యూస్ తెలుస్తుంది.. కానీ సామ్‌కి అది యాక్సిడెంట్ కాదు, ప్లాన్డ్ మర్డర్ అని అనుమానం వస్తుంది.

Advertisement

అజుకి గతంలో ఆ రాబరీ గ్యాంగ్‌తో ఏదో లింక్ ఉందని తెలుస్తుంది. ఇక్కడి నుంచి రెండు కేసులూ ఒకటిగా మారుతాయి. ఇన్వెస్టిగేషన్‌లో సామ్‌కి సాక్షి అనే డాక్టర్ సహాయం చేస్తుంది. గ్యాంగ్ లీడర్ రియాజ్ ఖాన్ కి రాజకీయ నాయకులతో లింక్ ఉందని తెలుస్తుంది.క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. ఆ ట్విస్ట్లు ఏమిటి ? అజుని ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? ఈ కేసును సామ్ ఎలా డీల్ చేస్తాడు ? అనే విషయాలను, ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×