E-Paper
Advertisement

A Knight Of The Seven Kingdoms OTT : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ప్రీక్వెల్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

A Knight Of The Seven Kingdoms OTT : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ప్రీక్వెల్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?
Advertisement

A Knight Of The Seven Kingdoms OTT : మోస్ట్ పాపులర్ ఫాంటసీ సిరీస్ గా ఇప్పటికీ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అనే చెప్పుకుంటారు. ఇది ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఫాంటసీ సిరీస్ ఫ్యాన్స్‌కి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఈ సిరీస్ ప్రీక్వెల్ ‘A Knight of the Seven Kingdoms’ ఇప్పుడు స్ట్రీమింగ్‌ కి వచ్చేసింది. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ 100 సంవత్సరాల ముందు జరుగుతుంది. ఇయండిబిలో దీనికి 8.9/10 రేటింగ్ ఉండటం విశేషం. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకివెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ఎ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్’ జార్జ్ ఆర్. ఆర్. మార్టిన్ రూపొందించిన ఒక అమెరికన్ ఫాంటసీ టెలివిజన్ సిరీస్. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు ప్రీక్వెల్. ఇది మార్టిన్ ‘ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్’ ఫ్రాంచైజీలో మూడవ టెలివిజన్ సిరీస్. Tales of Dunk and Egg నవలల ఆధారంగా ఇది రూపొందింది. ఈ సిరీస్ 2026 జనవరి 18న HBOలో ప్రీమియర్ అయింది. ఇది ఆరు ఎపిసోడ్‌లను కలిగి ఉంది. అయితే భారతదేశంలో జియో హాట్‌స్టార్‌లో ప్రతి వారం ఒక ఎపిసోడ్ చొప్పున ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ ఈ రోజు స్ట్రీమింగ్ లోకి వచ్చింది.

Advertisement

Read Also : IMDbలో 7.5 రేటింగ్‌… వింత కొరియర్‌తో మొదలయ్యే కథ… ట్రెండింగ్ నెంబర్ 1లో క్రైమ్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

ఇది ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ కథకు దాదాపు 100 ఏళ్ల క్రితం జరుగుతుంది. ఈ కథలో డ్రాగన్లు లేవు, అవి అప్పటికే అంతరించిపోయి ఉంటాయి. టార్గెరియన్ వంశం అప్పుడు ఏడు రాజ్యాలను పరిపాలిస్తూ ఉంటుంది. ఇక ‘డంక్’ అనే ఒక యోధుడు కథలో ఎంట్రీ ఇస్తాడు. అష్‌ఫోర్డ్ అనే చోట జరిగే భారీ యుద్ధ పోటీల్లో పాల్గొనడానికి బయలుదేరుతాడు. దారిలో ఒక సత్రం వద్ద ఎగ్ అనే బాలుడు డంక్‌ని కలుస్తాడు. తనను కూడా యుద్ధ పోటీలకు తీసుకెళ్లమని కోరతాడు. మొదట నిరాకరించిన డంక్, చివరకు ఎగ్‌ను తనతో తీసుకెళ్తాడు. నిజానికి అ బాలుడి అసలు పేరు ఏగాన్ టార్గెరియన్, రాజకుటుంబానికి చెందినవాడు. ఈ విషయం గోప్యంగా ఉంచుతాడు.

Advertisement

ఇక ‘డంక్’ అష్‌ఫోర్డ్ చేరుకున్నాక, పోటీల సమయంలో మరో రాజకుమారుడు ఏరియన్ టార్గెరియన్ ఒక అమాయక యువతిని వేధిస్తుంటాడు. అది చూసిన డంక్, రాజకుమారుడు అని తెలిసినా సరే, అతడిని కొట్టి ఆమెను రక్షిస్తాడు. ఇక రాజకుటుంబీకుడిపై చేయి చేసుకున్నందుకు డంక్‌కు మరణశిక్ష పడే ప్రమాదం ఉంటుంది. ఇక ఆ ప్రమాదం నుంచి డంక్‌ బయట పడతాడా ? యుద్ధ పోటీల్లో అతను పాల్గొంటాడా ? డంక్ తో ఉన్న రాకుమారుడి పాత్ర ఏమిటి ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×