E-Paper
Advertisement

Realme P4 Power smartphone: రియల్‌మీ నుంచి వస్తున్న ఈ కొత్త ఫోన్ పవర్‌కు తిరుగులేదు.. ధర, ఫీచర్లు, పూర్తి వివరాలివే!

Realme P4 Power smartphone: రియల్‌మీ నుంచి వస్తున్న ఈ కొత్త ఫోన్ పవర్‌కు తిరుగులేదు.. ధర, ఫీచర్లు, పూర్తి వివరాలివే!
Advertisement

Realme P4 Power smartphone: ప్రముఖ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతున్న రియల్‌మీ.. ఇప్పుడు మరో పవర్‌ఫుల్ మొబైల్‌ Realme P4 Powerను త్వరలోనే భారత మార్కెట్‌లోకి తీసుకురానుంది. ముఖ్యంగా భారీ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. జనవరి 29న ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

పవర్‌ఫుల్ బ్యాటరీయే హైలైట్:

ఈ స్మార్ట్‌ఫోన్ పేరులోనే పవర్ ఉంది. దానికి తగ్గట్టే దీనిలో ఏకంగా 10,000mAh బ్యాటరీని అమర్చడం విశేషం. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5,000mAh బ్యాటరీని చూస్తుంటాం. కానీ దానికి రెట్టింపు సామర్థ్యంతో వస్తున్న ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒకటిన్నర రోజుల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ బరువు కేవలం 218-219 గ్రాముల్లోపే ఉండటం గమనార్హం. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటంతో, ఇంత పెద్ద బ్యాటరీని కూడా త్వరగానే ఛార్జ్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 7500mAh బ్యాటరీ.. వన్‌ప్లస్ 15T పెర్ఫార్మెన్స్ మాములుగా లేదుగా!

ఆకట్టుకునే డిస్‌ప్లే:

ఇక డిస్‌ప్లే విషయానికొస్తే ఈ Realme P4 Power.. 6.78 అంగుళాల 1.5K క్వాడ్ కర్డ్వ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు చాలా స్మూత్ అనుభూతిని ఇస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌ను వాడారు. దీనికి తోడు హైపర్‌విజన్, AI చిప్‌ను కూడా జోడించారు. ఇది ఫోన్ వేగాన్ని, కెమెరా పనితీరును మరింత మెరుగుపరుస్తుంది.

కెమెరా, ఇతర ఫీచర్లు:

Advertisement

Realme P4 Power ఫోన్ వెనుక భాగంలో 3 కెమెరాల సెటప్ ఉంటుంది. అలాగే OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP సెన్సార్ ఉండవచ్చని అంచనా. సెల్ఫీల కోసం ముందు వైపు 16MP కెమెరాను అందించారు. ఇక సాఫ్ట్‌వేర్ పరంగా.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ UI 7.0తో రానుంది. దీనికి మూడేళ్ల పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. ట్రాన్స్ సిల్వర్, ట్రాన్స్ ఆరెంజ్, ట్రాన్స్ బ్లూ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో రానున్న ఈ ఫోన్.. భారత మార్కెట్లో సుమారు రూ.25వేల నుంచి రూ. 30వేల మధ్య ఉండే అవకాశం ఉంది.

Also Read: ఛార్జింగ్ టెన్షన్ ఉండదిక.. 7100mAh బ్యాటరీ వన్‌ప్లస్ నార్డ్ CE5 5G ఇప్పుడు తక్కువ ధరకే!

 

 

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×