E-Paper
Advertisement

మెంటల్ హాస్పిటల్ నుంచి తిరిగొచ్చే అక్కా చెల్లెల్లు… మెంటలెక్కించే కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్

మెంటల్ హాస్పిటల్ నుంచి తిరిగొచ్చే అక్కా చెల్లెల్లు… మెంటలెక్కించే కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

Horror Movie on OTT : ఒక పెద్ద ఇల్లు. మౌనంగా ఉండే గదులు. మాట్లాడటానికి ఇష్టపడని తండ్రి. వింతగా ప్రవర్తించే సవతి తల్లి. మెంటల్ హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన ఇద్దరు అక్కాచెల్లెల్లు. వినడానికి ఇది ఒక ఫ్యామిలీ డ్రామాలా అనిపిస్తుంది. కానీ కొద్దిసేపటికే ఆ ఇంట్లో ఏదో సరిగ్గా లేదని అర్థమవుతుంది. అసలు సమస్య ఇంట్లో ఉందా? ఆ అమ్మాయిల్లో ఉందా? లేదా ప్రేక్షకుడే తప్పు దిశలో ఆలోచిస్తున్నాడా? ఇదే ‘ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్’ (A tale of two sisters)సినిమా గొప్పతనం.

ఈ కథ దెయ్యాల గురించా?:

2003లో విడుదలైన ఈ దక్షిణ కొరియా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌కు కిమ్ జీ వూన్ దర్శకత్వం వహించాడు. విడుదలైన రెండు దశాబ్దాల తర్వాత కూడా ప్రపంచంలోని అత్యుత్తమ సైకలాజికల్ హారర్ సినిమాల జాబితాలో ఈ చిత్రం కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కథలో సూ మి, సూ యోన్ అనే ఇద్దరు సిస్టర్స్ సైకాలజీ నుంచి ఇంటికి తిరిగి వస్తారు. బయటకు చూస్తే వాళ్ల ఇల్లు అందంగా ఉంటుంది. కానీ ఆ ఇంటి వాతావరణంలో ఒక విచిత్రమైన ఒత్తిడి కనిపిస్తుంది. ముఖ్యంగా వారి సవతి తల్లితో ఉన్న సంబంధం మొదటి నుంచే అసహజంగా అనిపిస్తుంది.

Advertisement

రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్లో వింత ఘటనలు జరగడం మొదలవుతుంది. రాత్రిళ్లు వినిపించే శబ్దాలు, ఖాళీ గదుల్లో కనిపించే నీడలు, అర్థం కాని ప్రవర్తనలు కథను క్రమంగా చీకటివైపు తీసుకెళ్తాయి. కానీ దర్శకుడు ప్రేక్షకుడికి ఎప్పుడూ స్పష్టమైన సమాధానం ఇవ్వడు. కనిపిస్తున్నది నిజమా, భ్రమా, జ్ఞాపకమా, లేక పీడకలా అనే సందేహం ప్రతి సన్నివేశంలో ఉంటుంది.

ఈ సినిమా ప్రత్యేకత భయపెట్టడంలో కాదు. గందరగోళంలో పడేయడంలో ఉంది. ప్రేక్షకుడు ఒక విషయం నిజమని నమ్మిన క్షణంలోనే కథ మరో దిశలోకి తిరుగుతుంది. ఒక పాత్రపై జాలి పడతారు. కొద్దిసేపటికి అదే పాత్రపై అనుమానం మొదలవుతుంది. మళ్లీ తర్వాత పరిస్థితి మారిపోతుంది.

Advertisement

హాలీవుడ్ హారర్ సినిమాల్లో కనిపించే పెద్ద శబ్దాలు, అకస్మాత్తుగా ఎదురుగా వచ్చే దెయ్యాలు ఇక్కడ చాలా తక్కువ. దానికి బదులుగా పిన్‌ డ్రాప్‌ సైలెన్స్, కెమెరా ఫ్రేములు, పాత్రల మధ్య ఉన్న ఉద్రిక్తతతో భయాన్ని సృష్టిస్తారు. అందుకే సినిమా పూర్తయ్యాక కూడా కొన్ని సన్నివేశాలు మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఇంతకి అసలు ఈ కథ దెయ్యాల గురించా? కుటుంబ రహస్యాల గురించా? మానసిక గాయాల గురించా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను దర్శకుడు ప్రేక్షకుడికే వదిలేస్తాడు. అందుకే ఈ సినిమాను ఓ పజిల్‌లా చెప్పవచ్చు..

Read Also : అమ్మాయిల ఇన్నర్ పార్ట్స్ తో కళాఖండాలు… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ ఉన్న సైకో థ్రిల్లర్

Related News

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

Big Stories

Advertisement
×