E-Paper
Advertisement

దృశ్యం3 రిలీజ్ డేట్ లాక్.. స్పెషల్ పోస్టర్ పంచుకున్న మీనా!

దృశ్యం3 రిలీజ్ డేట్ లాక్.. స్పెషల్ పోస్టర్ పంచుకున్న మీనా!

Drishyam 3:మలయాళ చిత్ర పరిశ్రమలో ఒరిజినల్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చి.. మిగతా భాషలలో రీమేక్ అయ్యి అన్ని భాషలలో కూడా సక్సెస్ ఫుల్ గా కలెక్షన్లు వసూలు చేసి రికార్డులు సృష్టించిన చిత్రం దృశ్యం. ఇక ఈ సిరీస్ కి ఉన్న క్రేజ్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ , మీనా జంటగా వచ్చిన మొదటి రెండు భాగాలు భాషతో సంబంధం లేకుండా అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. హిందీ, తెలుగు వంటి భాషలలో రీమేక్ అయ్యి మంచి రికార్డులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు రాబోయే మూడవ భాగం కోసం పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

లీగల్ ఇష్యూ వల్ల వాయిదా.. కొత్త డేట్ అనౌన్స్..

అయితే ఈ సినిమా విడుదలకు ముందే చట్టపరమైన చిక్కుల్లో పడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఈ సినిమాను నిర్మిస్తున్న ఆశీర్వాద్ సినిమాస్ గతంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ తో కుదుర్చుకున్న డిజిటల్ డీల్ ను రద్దు చేసింది. దీంతో అమెజాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. డిజిటల్ సంస్థకు అనుకూలంగా కీలక తీర్పునిస్తూ మే 15వ తేదీ వరకు దృశ్యం 3 సినిమాకు సంబంధించిన ఎటువంటి కొత్త డీల్స్ ను కుదుర్చుకోవడానికి వీలు లేకుండా నిర్మాతలకు స్టే ఆర్డర్ జారీ చేసింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని మే 21న విడుదల చేయాలని విశ్లేషకులు భావించిన ఈ కోర్టు తీర్పు వల్ల వాయిదా పడుతుందనే కామెంట్లు వ్యక్తమయ్యాయి.

రిలీజ్ డేట్ ప్రకటించిన మీనా..

అయితే తాజాగా ఈ విషయాన్ని మీనా ప్రస్తావిస్తూ గేమ్ ఇంకా పూర్తి కాలేదు అంటూ దృశ్యం రిలీజ్ డేట్ ను ప్రకటించింది. దృశ్యం 3 పోస్టర్ ను పంచుకుంటూ..” గేమ్ ఇంకా పూర్తి కాలేదు. ప్రపంచవ్యాప్తంగా మే 21న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది” అంటూ మీనా స్పష్టం చేసింది. మొత్తానికైతే ఈ సినిమా మే 21న థియేటర్లలోకి రాబోతుండడంతో లీగల్ ఇష్యూ సమస్యకి పరిష్కారం దొరికిందా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

ప్రమోషన్స్ లేనట్టేనా?

ఇకపోతే అందరినీ ఆశ్చర్యపరిచే అంశం మరోటి ఏమిటంటే.. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా.. గల్ఫ్ దేశాలలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మే 21కి వాయిదా వేశారు. విడుదల తేదీకి కేవలం మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు ఒక అప్డేట్ కూడా ఇవ్వకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. సాధారణంగా భారీ చిత్రాలకు నెలల ముందే ప్రమోషన్స్ మొదలుపెడతారు. అలాంటిది దృశ్యం ఫ్రాంచైజీలో వస్తున్న మూడవ చిత్రం అభిమానులలో అంచనాలు పెంచుకుంది.

ALSO READ:Bigg Boss 10: బిగ్ బాస్ 10లోకి ఇద్దరు టాప్ సెలబ్రిటీస్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

అందుకే ప్రమోషన్స్ చేయడం లేదా?

ఇలాంటి సమయంలో ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది . ఇకపోతే కేవలం ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ పైనే ఆధారపడడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ దెబ్బ తినే అవకాశం కూడా ఉందని ట్రేడ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాలోని సస్పెన్షన్ కాపాడడం కోసమే మేకర్స్ ఇలా కంటెంట్ ను బయట పెట్టడం లేదా అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.. మరి ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.

Related News

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

Big Stories

×