Korean Kanakaraju OTT : హైదరాబాద్ కుర్రాడి లైఫ్‌లోకి అనుకోకుండా ఒక కొరియన్ అమ్మాయి వస్తే ? అక్కడితో ఆగకుండా ఆమె వెనుక ఓ గగుర్పొడిచే దెయ్యం కథ ఉందనే నిజం తెలిస్తే ? ప్రేమ, కడుపుబ్బా కామెడీ, భయపెట్టే హారర్, గూస్‌బంప్స్ తెప్పించే థ్రిల్… ఇవన్నీ ఒకేసారి ఆ కుర్రాడికి ఎదురైతే అతని పరిస్థితి ఎలా ఉంటుంది ? పక్కా లోకల్ హైదరాబాద్ కల్చర్, స్టైలిష్ కొరియన్ బ్యాక్‌డ్రాప్ రెండింటినీ కలిపి ఫన్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్ అందించే సరికొత్త ప్రయత్నమే ‘Korean Kanakaraju’. సెప్టెంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఇండో-కొరియన్ కామెడీ హారర్ థ్రిల్లర్‌లో నవ్వులతో పాటు వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు అలరిస్తాయి. మరి హైదరాబాద్ కుర్రాడికి ఆ కొరియన్ దెయ్యంతో ఉన్న సంబంధం ఏంటి ? ప్రశాంతంగా సాగుతున్న ప్రేమకథలోకి ఈ భయంకరమైన హారర్ డ్రామా ఎలా ప్రవేశించింది ? చివరికి ఆ కుర్రాడి పరిస్థితి ఏమైంది ? అనే ఆసక్తికరమైన వివరాలపై ఓ లుక్కేద్దాం.
కథలో హీరో హైదరాబాద్ నగరంలో తనకంటూ ఒక సాధారణ, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. రొటీన్ పనులు, ఫ్రెండ్స్‌తో సరదా కబుర్లతో లైఫ్ ను గడిపేసే అతని లైఫ్‌లోకి ఓ కొరియన్ అమ్మాయి ఎంటర్ అవ్వడంతో పరిస్థితులు ఊహించని విధంగా మారిపోతాయి. భాష, సంస్కృతి వేరైనా మొదట ఆమెతో ఏర్పడిన పరిచయం కాస్త సరదాగా సాగి, క్రమంగా అది బలమైన ప్రేమగా మారుతుంది. అయితే ఆ అమ్మాయి ప్రేమతో పాటుగా, ఆమె అడుగు పెట్టినప్పటి నుంచి అతని జీవితంలో వింతైన, విచిత్రమైన భయంకరమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి.
తన చుట్టూ అసలు ఏం జరుగుతోంది ?ఈ హఠాత్ పరిణామాలకు కారణం ఏమిటి ? అనేది అర్థం చేసుకునేలోపే హీరోకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. తాను ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయి వెనుక ఒక భయంకరమైన అతీంద్రియ రహస్యం దాగి ఉందని, ఆమెను ఒక శక్త్యవంతమైన ఆత్మ వెంటాడుతోందని గ్రహిస్తాడు. ఆ తర్వాత అతని సమస్యలు మరింత రెట్టింపవుతాయి. ఒక స్వీట్ అండ్ సింపుల్ లవ్ స్టోరీ అనుకున్నది కాస్తా గజగజ వణికించే దెయ్యాలు, ఊహించని విపరీత పరిస్థితులతో నిండిన ఒక మైండ్ బ్లోయింగ్ హారర్ థ్రిల్లర్‌గా మారిపోతుంది.
ఒకవైపు తన ప్రాణానికి ప్రాణమైన ప్రేమను ఎలాగైనా నిలబెట్టుకోవాలి, మరోవైపు తనను, తన లవర్‌ను వెంటాడుతున్న ఆ భయంకరమైన ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడాలి. ఈ రెండు విభిన్నమైన పరిస్థితుల మధ్య హీరో చేసే రచ్చ, అతని స్నేహితులు పడే తాపత్రయం సినిమాకు కామెడీ టచ్ ఇస్తాయి. అసలు ఆ కొరియన్ అమ్మాయి నేపథ్యం ఏమిటి ? ఆమెకు ఆ దెయ్యానికి ఉన్న పగ ఏంటి ? తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఆ కుర్రాడు ఎంతటి సాహసాలు చేశాడు ? చివరికి ఈ ప్రేమికుల కథ సుఖాంతమైందా లేక ఊహించని మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్‌తో ముగిసిందా ? అనేదే ఈ సినిమాలో చూడాల్సిన ఆసక్తికరమైన అంశం.
Also Read : బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్
హైదరాబాద్ నేటివిటీని, కొరియన్ కల్చర్‌ని మిక్స్ చేసి తీసిన ఒక డిఫరెంట్ ఇండో-కొరియన్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ‘కొరియన్ కనకరాజు’. థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా సెప్టెంబర్ 4 నుంచి Netflix ఓటీటీలో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. తెలంగాణ కుర్రాడి అమాయకత్వం, హైదరాబాద్ కామెడీ, కొరియన్ ఎలిమెంట్స్, క్షణక్షణం సస్పెన్స్ ఇచ్చే హారర్ సినిమాలో హైలెట్. చాలాకాలం తరువాత వరుణ్ తేజ్ కు ఈ సినిమా రూపంలో భారీ హిట్ దక్కింది. థియేటర్లలో మిస్ అయిన వారు ఎంచక్కా ఇంట్లోనే ఈ సినిమాను ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయవచ్చు.