E-Paper
Advertisement

సబ్బు బిళ్ళతో తారుమారైన కథ.. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కామెడీ మూవీ

సబ్బు బిళ్ళతో తారుమారైన కథ.. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కామెడీ మూవీ
Advertisement

Action Comedy OTT : కామెడీ కంటెంట్ కు ఫ్యాన్స్ ఎక్కువగానే ఉంటారు. ప్రశాంతంగా నవ్వుకుని, కష్టాల నుంచి కొంచెమైన ఉపశమనం ఇచ్చేది ఈ జానర్ మాత్రమే. అలాంటి సినిమా చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. చివరి వరకు నవ్వుతూనే ఉంటారు. ఈ సినిమా నిడివి దాదాపు 112 నిమిషాలు ఉంటుంది. ఇది కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ కామెడీ చిత్రం. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ దగ్గుబాటి ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపినట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ కలసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాలని భావించారు. అయితే ఈ సినిమా ఎందుకనో ఆగిపోయింది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియన్ యాక్షన్ కామెడీ మూవీ పేరు ‘లక్ కీ’ (Luck Key). 2016లో వచ్చిన ఈ సినిమా లీ గే-బైయోక్ దర్శకత్వంలో తెరకెక్కింది.
ఇందులో యూ హే-జిన్, లీ జూన్, జో యూన్-హీ, లిమ్ జి-యోన్ లీడ్ రోల్స్ లో నటించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే 20 లక్షల మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి రికార్డు సృష్టించింది. మొత్తంగా ఈ చిత్రం సుమారు 48 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇది 2012లో వచ్చిన ‘కీ ఆఫ్ లైఫ్’ అనే జపనీస్ సినిమాకు రీమేక్ అయినప్పటికీ, కొరియన్ నేటివిటీకి తగ్గట్టుగా చేసిన మార్పులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రధాన నటుడు యూ హే-జిన్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇది Netflix, Amazon Prime Video ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో హ్యూంగ్ అనే ఒక భయంకరమైన ప్రొఫెషనల్ కిల్లర్ ఒక హత్య చేసి, స్నానం చేసేందుకు ఒక పబ్లిక్ బాత్‌హౌస్‌కి వెళ్తాడు. అక్కడ సోపు బిళ్ళ మీద కాలు జారి పడిపోయి బుర్ర పగిలి గతం మర్చిపోతాడు. అదే టైమ్‌లో అక్కడ ఒక పనిపాటా లేని ఒక జూనియర్ సినిమా ఆర్టిస్ట్ ఉంటాడు. కిల్లర్ పడిపోవడం చూసి, అతని దగ్గరున్న ఖరీదైన వాచ్, కార్ కీస్ ఉన్న లాకర్ కీని కొట్టేసి, తన దగ్గరున్న కీని అక్కడ పడేసి ఎస్కేప్ అవుతాడు. ఇక కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. హాస్పిటల్‌లో కళ్ళు తెరిచిన కిల్లర్, తన దగ్గర ఉన్న పాత కీని చూసి నేను ఒక పేద యాక్టర్‌నని ఫిక్స్ అయిపోతాడు. ఆ అమాయకత్వంతోనే సినిమాల్లో యాక్షన్ సీన్లు అదరగొట్టేసి పెద్ద స్టార్ అయిపోతాడు.

ఇంకోవైపు కిల్లర్ ఇంట్లో దూరిన మన చిల్లర యాక్టర్.. అక్కడ ఉన్న డబ్బు, కత్తులు, గన్‌లు చూసి హడలిపోతాడు. ఆ కిల్లర్ చేయాల్సిన ఒక మర్డర్ కాంట్రాక్ట్ వీడి మెడకు చుట్టుకుంటుంది. అయితే చివరికి అసలు కిల్లర్‌కి మెమరీ తిరిగొస్తుంది. తన ప్లేస్‌లో ఇంకొకడు ఎంజాయ్ చేస్తున్నాడని తెలిసి వాడిని పట్టుకుంటాడు. కానీ అప్పటికే వీళ్లిద్దరూ తమ కొత్త లైఫ్‌కి అలవాటు పడిపోతారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి ఆ మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డారు ? ఆ గందరగోళం నుంచి ఎలా తప్పించుకున్నారనేదే క్లైమాక్స్.

Advertisement

Read Also : దైవ నిర్ణయమా? డెవిల్స్ వేటనా? ప్రాణం తీసే వింత పిలుపు… చూస్తే అస్సలు వదిలిపెట్టరు

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×