E-Paper
Advertisement

దైవ నిర్ణయమా? డెవిల్స్ వేటనా? ప్రాణం తీసే వింత పిలుపు… చూస్తే అస్సలు వదిలిపెట్టరు

దైవ నిర్ణయమా? డెవిల్స్ వేటనా? ప్రాణం తీసే వింత పిలుపు…  చూస్తే అస్సలు వదిలిపెట్టరు
Advertisement

Horror Thriller OTT : కొరియన్ సిరీస్ లను ఇప్పుడు మనవాళ్ళు తెగ చూస్తున్నారు. మనవాళ్లే కాదు, ఇవి ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి కూడా. ఎక్కువగా రొమాంటిక్ సిరీస్ లను అదరిస్తున్నా, ఆ తరువాత హారర్ కంటెంట్ కూడా భారీ స్థాయిలోనే ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సూపర్ నాచురల్ సిరీస్ 2021లో వచ్చింది. ఈ సిరీస్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. అప్పట్లో రికార్డులు సృష్టించిన ‘స్క్విడ్ గేమ్’ కంటే వేగంగా ఇది టాప్ ప్లేస్‌కు వెళ్లడం విశేషం. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ కొరియెన్ సూపర్ నాచురల్ డార్క్ ఫాంటసీ వెబ్ సిరీస్ పేరు ‘హెల్‌బౌండ్’ (Hellbound). ఇది యోన్ సాంగ్-హో దర్శకత్వంలో తెరకెక్కింది. ఈయన అంతకుముందు ప్రపంచప్రసిద్ధ కొరియన్ జోంబీ సినిమా ‘ట్రైన్ టు బుసాన్’ తీసిన డైరెక్టర్. ఈ సిరీస్ కూడా ఆయన స్వయంగా రాసిన ‘హెల్‌బౌండ్’ అనే పాపులర్ వెబ్‌టూన్ ఆధారంగా తీశారు. మొదటి సీజన్‌లో మెయిన్ క్యారెక్టర్ (జిన్-సూ) చేసిన యూ ఆ-ఇన్ కొన్ని వ్యక్తిగత వివాదాల వల్ల సెకండ్ సీజన్ నుండి తప్పుకున్నారు. అతని ప్లేస్‌లో సీజన్ 2లో కిమ్ సుంగ్-చోల్ నటించారు. ఈ మార్పు అప్పట్లో కొరియన్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఈ సిరీస్ అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ‘టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శించబడిన మొదటి కొరియన్ డ్రామా సిరీస్ ఇదే. ఇది సీజన్ 1: 2021లో, సీజన్ 2: 2024 అక్టోబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కథ మొదలవ్వగానే అకస్మాత్తుగా ఒక వింత ఆకారం ప్రత్యక్షమై, ఫలానా వ్యక్తి ఫలానా సమయానికి చనిపోయి నరకానికి వెళ్తాడని ప్రకటిస్తుంది. సరిగ్గా ఆ సమయం రాగానే, ముగ్గురు భయంకరమైన రాక్షస జీవులు వచ్చి అందరి ముందే ఆ వ్యక్తిని అత్యంత క్రూరంగా చంపేస్తారు. ఈ సంఘటనలతో నగరం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. అప్పుడే’జిన్-సూ అనే వ్యక్తి ‘న్యూ ట్రూత్ సొసైటీ’ అనే సంస్థను స్థాపించి, ఇవన్నీ పాపులకు దేవుడు వేస్తున్న శిక్షలని ప్రచారం చేస్తాడు. ప్రజలందరూ భయంతో అతని మాటలు నమ్ముతారు. కానీ హే-జిన్ అనే లాయర్ మాత్రం, ఇది దైవికమైన శిక్ష కాదని, దీని వెనుక ఏదో మిస్టరీ ఉందని నమ్ముతూ ఆ సంస్థ అరాచకాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది.

ఇక రెండవ సీజన్‌లో కథ ఇంకా మలుపు తిరుగుతుంది. గతంలో రాక్షసుల చేతిలో చనిపోయిన వాళ్ళు ఇప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ బతికి వస్తారు. ఇలా రావడంతో సమాజంలో కొత్త గందరగోళం మొదలవుతుంది. అసలు వాళ్ళు ఎందుకు తిరిగి వచ్చారు? ఈ వింత సంఘటనల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనే ఉత్కంఠభరితమైన అంశాలతో ఈ కథ క్లైమాక్స్ వరకు కొనసాగుతుంది.

Advertisement

Read Also : మాఫియా డాన్ల మధ్య మొదలయ్యే వేట… ఆఖరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టించేలా చేసే సినిమా

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×