Vaibhav – Bumrah: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals vs Mumbai Indians ) మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. వర్షం కారణంగా 11 ఓవర్లకే మ్యాచ్ కుదించారు. ఈ క్రమంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఇరగదీసింది. ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi ) ఊచ కోశాడు. ముంబై డేంజర్ బౌలర్ బుమ్రా ( Bumrah) వేసిన తొలి బంతిని సిక్సర్ కొట్టిన వైభవ్ సూర్య వంశీ, అతని పరువు తీశాడు. ఇదే ఓవర్ లో మరో సిక్సర్ కూడా కొట్టి బుమ్రాకు షాక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. బుమ్రాకు చుక్కలు చూపించావు కదా అంటూ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. వర్షం కారణంగా మ్యాచును 11 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో 11 ఓవర్లు వాడిన రాజస్థాన్ రాయల్స్ కేవలం మూడు వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. యశస్వి జైస్వాల్ 32 బంతుల్లో 77 పరుగులు చేసి ఇరగదీశాడు. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే 10 బౌండరీలు ఉన్నాయి. అటు వైభవ్ సూర్య వంశీ 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 20 పరుగులతో పర్వాలేదనిపించాడు. దీంతో 150 పరుగులు పూర్తి చేసుకుంది రాజస్థాన్ రాయల్స్. మరి కాసేపట్లో చేజింగ్ కు దిగనుంది ముంబై ఇండియన్స్.
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ( Rajasthan Royals vs Mumbai Indians ) మధ్య జరిగిన మ్యాచ్ లో 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ, నెంబర్ వన్ టి20 బౌలర్ బుమ్రా పరువు తీశాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా రెండవ ఓవర్ వేశాడు. ఈ రెండో ఓవర్ బంతిని సిక్సర్ కొట్టాడు వైభవ్ సూర్య వంశీ. ఆ తర్వాత నాలుగో బంతిని కూడా సిక్సర్ పంపించాడు. ఇలా ఒకే ఓవర్ లో 14 పరుగులు పిండుకున్నారు. ఈ సిక్సర్ల వర్షానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బుమ్రా ( Bumrah) అంటే ఏమాత్రం గౌరవం లేకుండా వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi ) ఊచకోత కోశాడని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
15 YEARS OLD VAIBHAV SURYAVANSHI SMASHING 1ST BALL SIX TO BUMRAH 💀 pic.twitter.com/I3p8x27k3Y
— Cricket Central (@CricketCentrl) April 7, 2026