E-Paper
Advertisement

గుండెల్లో వణుకు పుట్టించే సముద్రపు దొంగలు… వన్ పీస్ ను మించిన అడ్వెంచర్

గుండెల్లో వణుకు పుట్టించే సముద్రపు దొంగలు… వన్ పీస్ ను మించిన అడ్వెంచర్
Advertisement

Historical Adventure Series : 18వ శతాబ్ధం, సముద్రపు దొంగల స్వర్ణయుగంగా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో వస్తున్న సినిమాలు, సిరీస్లు ఓ ఊపు ఊపుతున్నాయి. ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ లాంటి సినిమాలు ఒక సంచాలనమే అయ్యాయి. రీసెంట్ గా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ‘వన్ పీస్’ సిరీస్ ఆడియన్స్ కి కూడా తెగ నచ్చేసింది. అయితే వీటిని మరపించే ఒక సిరీస్ ఓటీటీలో నాలుగు సీజన్లతో సంచలనాలు సృష్టించింది. దీనికి ఐయండిబిలో 8.2 రేటింగ్ కూడా ఉంది. దీని షూటింగ్ అంతా దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ ఫిలిం స్టూడియోస్‌లో భారీ సెట్స్ వేసి తీశారు. టెక్నికల్ గా కూడా ఈ సిరీస్ చాలా ఉన్నతంగా ఉంటుంది. సముద్రం మీద జరిగే భారీ యుద్ధాలు, విజువల్ ఎఫెక్ట్స్ కు గాను ఈ సిరీస్ ఏకంగా రెండు ఎమ్మీ అవార్డులను గెలుచుకుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ హిస్టారికల్ డ్రామా సిరీస్ పేరు ‘బ్లాక్ సెయిల్స్’ (Black Sails). ఈ సిరీస్‌లో కేవలం కల్పిత పాత్రలే కాకుండా, చరిత్రలో నిజంగా ఉన్న చార్లెస్ వేన్, అన్నే బోనీ, బ్లాక్‌బేర్డ్ వంటి సముద్రపు దొంగలను కూడా చూపించారు. ఇది మనం చిన్నప్పుడు చదువుకున్న ‘ట్రెజర్ ఐలాండ్’ నవలకి 20 ఏళ్ల ముందు ఏం జరిగిందో చెప్పే కథ. అంటే ఆ నవలలో ఉండే ముసలి జాన్ సిల్వర్, కెప్టెన్ ఫ్లింట్ యువకులుగా ఉన్నప్పుడు ఎంత పవర్‌ఫుల్‌గా ఉండేవారో ఇందులో చూడొచ్చు. ఈ సిరీస్‌ను ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు మైఖేల్ బే నిర్మించారు. ఇందులో మొత్తం 4 సీజన్లు (38 ఎపిసోడ్లు) ఉన్నాయి. సీజన్ 1 (2014): ఇందులో 8 ఎపిసోడ్లు ఉంటాయి. సీజన్ 2 (2015): ఇందులో 10 ఎపిసోడ్లు ఉన్నాయి. సీజన్ 3 (2016): ఇందులో కూడా 10 ఎపిసోడ్లు ఉన్నాయి. సీజన్ 4 (2017): ఇది చివరి సీజన్, ఇందులో 10 ఎపిసోడ్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ సిరీస్ Netflix, Amazon Prime Video లలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇది 1700ల కాలంలో ‘నసావు’ అనే ఒక ద్వీపం చుట్టూ జరిగే కథ. అక్కడ సముద్రపు దొంగల రాజ్యం నడుస్తుంటుంది. ఆ రాజ్యాన్ని బ్రిటీష్ వాళ్ల నుండి కాపాడుకోవడానికి కెప్టెన్ ఫ్లింట్ అనే ఒక గట్టి సముద్రపు దొంగల లీడర్ చేసే పోరాటమే ఈ సిరీస్. ఈ కథలో జాన్ సిల్వర్ అనే ఒక తెలివైన కుర్రాడు ఫ్లింట్ టీమ్‌లో చేరతాడు. వీళ్లిద్దరూ కలిసి ఒక పెద్ద నిధి కోసం వెతుకుతుంటారు. కానీ ఆ ప్రయాణంలో ఒకరినొకరు నమ్మాలా వద్దా అనే అనుమానాలు, గ్రూపుల మధ్య గొడవలు, వెన్నుపోట్లు కథను ఆసక్తికరంగా మారుస్తాయి. కేవలం బంగారం కోసమే కాకుండా, స్వేచ్ఛ కోసం ఆ దొంగలందరూ కలిసి బ్రిటీష్ సామ్రాజ్యంతో యుద్ధానికి దిగుతారు. చివరకు ఆ నిధి ఎవరికి దక్కింది? నసావు ద్వీపం ఎవరి వశమైంది? అనేది చాలా పవర్ ఫుల్ గా చూపిస్తారు.

Read Also : సిటీ అంతా శవాల దిబ్బ… ప్రతి అడుగులోనూ పొంచి ఉన్న మృత్యువు… గుండె దడ పెంచే సిరీస్

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×