E-Paper
Advertisement

తాగుబోతు వెధ‌వ‌ల‌ను PSL నుంచి త‌రిమికొట్టండి..వార్న‌ర్ పై ఇంజమామ్ సీరియ‌స్‌

తాగుబోతు వెధ‌వ‌ల‌ను PSL నుంచి త‌రిమికొట్టండి..వార్న‌ర్ పై ఇంజమామ్ సీరియ‌స్‌
Advertisement

Inzamam Ul Haq on david warner : పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) నేపథ్యంలో డేవిడ్ వార్నర్ ( david warner) అడ్డంగా దొరికిపోయాడు. టోర్నమెంట్ మధ్యలో ఆస్ట్రేలియా వెళ్లిన డేవిడ్ వార్నర్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ( david warner drink and drive case) అరెస్ట్ అయ్యాడు. దీంతో డేవిడ్ వార్నర్ మళ్లీ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చేది సందేహంగా మారింది. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ అరెస్టయిన సంఘటనపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్  ఇంజమామ్ ఉల్ హ‌క్  ( Inzamam Ul Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి తాగుబోతు వెధవలకు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఛాన్స్ ఉండబోదని.. వీళ్లను తరిమికొట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా మరింత దిగజారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇంజమామ్ ఉల్ హ‌క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Tanveer Ahmed On MI: ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం

తాగుబోతు వెధ‌వ‌ల‌ను PSL నుంచి త‌రిమికొట్టండి

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా ఆస్ట్రేలియాకు డేవిడ్ వార్నర్ వెళ్లడంపై ఇంజమామ్ ఉల్ హ‌క్ చాలా సీరియస్ అయ్యారు. అలా మధ్యలో పంపినందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, కరాచీ కింగ్స్ యాజమాన్యం పైన నిప్పులు చెరిగారు. ఇలా టోర్నమెంట్ మధ్యలో వెళ్లి, డేవిడ్ వార్నర్ అరెస్టు కావడం దారుణం అన్నారు. ఇప్పుడు అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడేందుకు రాకపోతే, కరాచీ కింగ్స్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని మండిపడ్డారు. అలాగే పాకిస్తాన్ పరువు కూడా పోతుందని ఎమోషనల్ అయ్యారు.

విదేశీ క్రికెటర్లను పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడించేందుకు చాలా కష్టపడుతున్నామని.. ఇలాంటి క్రమంలో డేవిడ్ వార్నర్ ఎపిసోడ్ చోటు చేసుకోవడం దారుణం అన్నారు. కరాచీ కింగ్స్ కెప్టెన్ గా ఉండే డేవిడ్ వార్నర్ ను మధ్యలో ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. లీగ్ పూర్తయిన తర్వాత ప్లేయర్లు ఎక్కడికి వెళ్లినా పర్వాలేదు… కానీ టోర్నమెంట్ కొనసాగుతున్న క్రమంలో ఇలా విదేశాలకు పంపిస్తే, ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఇప్పుడు డేవిడ్ వార్నర్ అరెస్టయ్యాడు..అత‌ని తిరిగి రాక‌పోతే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంజమామ్ ఉల్ హ‌క్.

డేవిడ్ వార్న‌ర్ ఎప్పుడు తిరిగి వ‌స్తాడు ?

Advertisement

సిడ్ని పోలీసులు డేవిడ్ వార్నర్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో అరెస్టు చేశారు. అయితే అరెస్టయిన రెండు గంటల తర్వాత, విచారణ చేసి డేవిడ్ వార్నర్ ను పోలీసులు వదిలేసినట్లు తెలుస్తోంది. ఇక మే ఏడవ తేదీకి ఈ కేసును షెడ్యూల్ చేశారు. ఆ రోజున ఖచ్చితంగా కోర్టుకు డేవిడ్ వార్నర్ హాజరు కావాల్సి ఉంటుంది. ఇక ఏప్రిల్ 9వ తేదీన పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లోకి డేవిడ్ వార్నర్ రీ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు.

 

 

 

 

Also Read: Shardul Thakur overthrow: శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×