BigTV English
Advertisement

OTT Movie : రిటైర్ అయిన ముసలోడితో అలాంటి పని… ఈ అమ్మాయి అరాచకాన్ని సింగిల్ గా చూడాల్సిందే మావా

OTT Movie : రిటైర్ అయిన ముసలోడితో అలాంటి పని… ఈ అమ్మాయి అరాచకాన్ని సింగిల్ గా చూడాల్సిందే మావా

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు యాక్షన్ ఎలిమెంట్ యాడ్ అయితే అదిరిపోతుంది కదా. రెండు జానర్లు మిక్స్ అయితే ఆ సినిమా రెండు వర్గాల ప్రేక్షకులకు కన్నుల పండుగ అవుతుంది. దుమ్మురేపే యాక్షన్ సీన్స్, కళ్ళు పక్కకు తిప్పుకోనివ్వని ఎంగేజింగ్ క్రైమ్ స్టోరీ ట్విస్టులు… ఊహించడానికి భలేగా ఉంది కదా. మరి ఈ రెండు అంశాలు మిక్స్ అయి ఉన్న ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

పోలార్ (Polar) 2019లో విడుదలైన హాలీవుడ్ యాక్షన్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా. జోనాస్ ఆకర్‌లండ్ దర్శకత్వంలో, విక్టర్ సాంటోస్ గ్రాఫిక్ నవల ‘పోలార్: కేమ్ ఫ్రమ్ ది కోల్డ్’ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో మాడ్స్ మిక్కెల్సెన్ (డంకన్ విజ్లా / ది బ్లాక్ కైజర్), వానెస్సా హడ్జెన్స్ (కమిల్), కాథరిన్ విన్నిక్ (వివియన్), మ్యాట్ లూకాస్ (బ్లూట్), ఫెయ్ రెన్ (హిల్డా), రాబర్ట్ మైలెట్ (కార్ల్), జానీ నాక్స్‌విల్ (మైఖేల్ గ్రీన్) నటించారు. 1 గంట 49 నిమిషాలు ఉన్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో తెలుగు సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే… 

సినిమా డంకన్ విజ్లా (మాడ్స్ మిక్కెల్సెన్) “ది బ్లాక్ కైజర్” అనే పేరుతో ఉన్న ప్రసిద్ధ అసాసిన్ తో మొదలవుతుంది. అతను మోంటానాలోని ఒక మారుమూల ఊర్లో రిటైర్ అవ్వాలనుకుంటాడు. ఇన్నాళ్ల బ్లడీ వయోలెన్స్ కు చెక్ పెట్టి, పెన్షన్‌ తో శాంతియుత జీవితం గడపాలని ప్లాన్ చేస్తాడు. అతని ఎంప్లాయర్, అసాసిన్స్ యూనియన్ హెడ్ బ్లూట్ (మ్యాట్ లూకాస్) పెన్షన్ చెల్లించకుండా ఉండడానికి ప్లాన్ చేస్తాడు. డంకన్‌ను లయబిలిటీగా భావిస్తూ, అతన్ని చంపడానికి యంగ్ అసాసిన్స్ టీమ్‌ను (వివియన్ – కాథరిన్ విన్నిక్, హిల్డా – ఫెయ్ రెన్, కార్ల్ – రాబర్ట్ మైలెట్, లెక్స్) పంపుతాడు.


డంకన్ తన గత ఫ్లాష్‌బ్యాక్‌లలో క్రూరమైన అసాసిన్‌. కానీ ఇప్పుడు శాంతియుత జీవితం కోరుకుంటాడు. అతను తన నెయిబర్, ట్రామా విక్టిమ్ కమిల్ (వానెస్సా హడ్జెన్స్)తో స్నేహం చేస్తాడు. ఆమెకు సహాయం చేస్తాడు. అసాసిన్స్ టీమ్ డంకన్‌ను టార్గెట్ చేస్తుంది. కానీ అతను వారిలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తాడు. కార్ల్‌ను ఆక్స్‌తో, హిల్డాను గన్‌తో, లెక్స్‌ను టార్చర్ చేసి చంపుతాడు. వివియన్ కమిల్‌ను కిడ్నాప్ చేస్తుంది. మరి కిడ్నాప్ అయిన ఆమెను హీరో ఎలా కాపాడాడు? చివరికి మూవీ ఎలాంటి ట్విస్ట్ తో ఎండ్ అయ్యింది? అన్నది మూవీలో చూడాల్సిందే.

Read Also : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బాధలో ఉన్నాడని భర్తకు తెలియకుండా… నెక్స్ట్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్ మావా

Related News

Vash level 2: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సంచలనం.. మొదటి చిత్రంగా!

OTT Movie : ఏం సినిమా మావా… ఒక్కొక్క సీన్ కు రోమాలు నిక్కబొడుచుకోవడం పక్కా… హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు

OTT Movie : టీనేజ్ పాప మిస్సింగ్ తో టీచర్‌కు లింక్… నరాలు కట్టయ్యే ఉత్కంఠ

OTT Movie : దెయ్యాలకు ప్యాంట్ తడిపించే అన్నదమ్ములు… ఐఎండీబీలో 8.4 రేటింగ్… ఒక్కో సీన్ దబిడి దిబిడే

OTT Movie : చచ్చినా గేమ్‌ను వదలని దెయ్యం… వాలీబాల్ కెప్టెన్ కిరాతకం… అమ్మాయి మర్డర్ తో ఖతర్నాక్ షాక్

OTT Movie : ఐలాండ్‌లో అరాచకం… ఒకే అమ్మాయితో ఇద్దరబ్బాయిలు… ఫ్యామిలీతో చూడకూడని మూవీ మావా

OTT Movie : అన్నతో పెళ్ళి తమ్ముడితో యవ్వారం… ఈ క్రేజీ కొరియన్ సిరీస్ కెవ్వు కేక

OTT Movie : సైకో కిల్లర్స్‌తో నిండిపోయే హోటల్… గ్రిప్పింగ్ స్టోరీ, సీట్ ఎడ్జ్ థ్రిల్… బ్లడీ బ్లడ్ బాత్

Big Stories

×