OTT Movie : ఓటీటీలలో యూనిక్ స్టోరీల గురించి వెతుకుతున్నారా? 2019లో రిలీజ్ అయిన ఒక అవుట్‌స్టాండింగ్ ఈ తమిళ డ్రామా-కామెడీ మూవీ మీ కోసమే. ఈ తమిళ ఆంథాలజీ డ్రామా నాలుగు ఇంటర్‌కనెక్టెడ్ కథలతో, సమాజంలో జరిగే దారుణాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చో, కథ ఏంటో తెలుసుకుందాం రండి.
తమిళ కామెడీ డ్రామా పేరు Super Deluxe. త్యారాజన్ కుమారరాజా దర్శకత్వంలో, టైలర్ డర్డెన్ అండ్ సన్స్ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ 2019 మార్చి 29న థియేటర్‌లో రిలీజైంది. ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి (షిల్పా), సమంత (వైష్ణవి), ఫహద్ ఫాసిల్ (బెర్లిన్), రమ్య కృష్ణ (లీలా), మిష్కిన్ (జ్యోతి), బాగవతి పెరుమాళ్ (ముగిల్), అశ్వంత్ అశోక్‌కుమార్ (రసూక్), సంచన నటరాజన్ (సోజీ) ప్రధాన పాత్రలు పోషించారు. IMDbలో 8.3 రేటింగ్ ఉన్న ఈ మూవీ మంచి ఫీస్ట్ అవుతుంది. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (విజయ్ సేతుపతి), బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డులను ఈ మూవీ గెలుచుకుంది. సినిమాలో ట్రాన్స్‌జెండర్ ఇష్యూస్, పెద్దలకు మాత్రమే అనే సీన్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి చిన్నపిల్లలు లేనప్పుడు చూడడం బెటర్.
ఈ మూవీ నాలుగు వేర్వేరు కథాంశాలను, చెన్నైలో ఒక రోజులో జరిగే సంఘటనలను చూపిస్తుంది. ముందుగా మణిక్ కథ… మణిక్ (విజయ్ సేతుపతి) ట్రాన్స్‌జెండర్ మహిళ షిల్పాగా మారతాడు. తన గత జీవితాన్ని వదిలి, చెన్నైలోని తన కుటుంబం దగ్గరకు తిరిగి వస్తుంది. ఆమె భర్త ముగిల్ (బాగవతి పెరుమాళ్), కొడుకు రసూక్ (అశ్వంత్ అశోక్‌కుమార్) ఆమె ట్రాన్సిషన్‌ను చూసి షాక్ అవుతారు. షిల్పాను ఫ్యామిలీలో ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయరు. పైగా ఇంట్లో నుంచి గెంటేస్తారు.
వైష్ణవి (సమంత) ఒక గృహిణి. తన భర్త జ్యోతి (మిష్కిన్)తో కలిసి, ఆమె మాజీ ప్రేమికుడు (సుందర్ రాము) డెడ్ బాడీని డీల్ చేయాల్సి వస్తుంది. అతను ఒక యాక్సిడెంట్‌లో చనిపోతాడు. వారు బాడీని డిస్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తూ, కామెడీ – సస్పెన్స్‌తో నిండిన సిట్యుయేషన్స్‌లో చిక్కుకుంటారు. ఇదే విధంగా సినిమాలో లీలా కథ, బెర్లిన్ కథ కూడా ఉంటాయి. ఈ నాలుగు కథలు ఒక డేలో ఇంటర్‌కనెక్ట్ అవుతాయి. సినిమా ఒక సూపర్ న్యాచురల్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? ఈ నాలుగు కథలు ఎలా కనెక్ట్ అయ్యాయి? అనేది స్టోరీ.
Read Also : కోరిక తీర్చలేదని గర్ల్ ఫ్రెండ్ ని ట్రిప్పుకు తీసుకెళ్లి… మస్ట్ వాచ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్