OTT Movie : పెద్దలకు మాత్రమే అనేలా అన్నీ అవే సీన్లు ఉన్నా, మేకర్స్ ఎంత ఓపెన్ గా చూపించినా… అలాంటి సినిమాలను చూసే వారి సంఖ్యకు కొదవేమీ లేదు. ఓటీటీలలో వెతుక్కుని మరీ టైం వచ్చినప్పుడు ఓ లుక్కేస్తున్నారు. అలా ఆతృతగా ఇలాంటి సినిమాల కోసమే ఎదురు చూస్తున్న వారికే ఈ మూవీ. ఇందులో మసాలా స్టఫ్ గట్టిగానే ఉంటుంది. కాబట్టి చూసేటప్పుడు సింగిల్ గా ఉంటేనే బెటర్.
‘థాంక్ యూ ఫర్ కమింగ్’ (Thank You for Coming) 2023లో విడుదలైన హిందీ డార్క్ కామెడీ డ్రామా. కరణ్ బూలానీ దర్శకత్వంలో, రిహా కపూర్ – ఎక్తా కపూర్ నిర్మాణంలో తెరకెక్కింది. ఈ మూవీలో భూమి పెడ్నేకర్ (కణికా కపూర్), షెహనాజ్ గిల్ (షౌర్య), డాలీ సింగ్ (జీజా), కుశా కపిలా (శ్రీ), షిబానీ బేడీ (మీరా), ప్రకాష్ ఠాకూర్ (అంకిత్), శర్వాని చిన్నప్ప (కృష్ణ), పార్వతి శర్మ (అంకిత్ తల్లి), అనిల్ కపూర్ (గెస్ట్ రోల్) తదితరులు నటించారు. 2023 అక్టోబర్ 6 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ అదే ఏడాది నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో అందుబాటులో ఉంది. ఫీమేల్ ప్లెజర్, ఫ్రెండ్‌షిప్, లవ్, లస్ట్, సెల్ఫ్-డిస్కవరీ వంటి అంశాలు మెండుగా ఉన్న ఈ. సినిమా TIFFలో ప్రీమియర్ అయింది,
సినిమా కణికా కపూర్ (భూమి పెడ్ణేకర్) చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక ఫుడ్ బ్లాగర్, డై-హార్డ్ రొమాంటిక్ ఫ్యాన్. కణికా తన లైఫ్‌లో ఎప్పుడూ సెల్ఫ్ శాటిస్ఫాక్షన్ ఎక్స్‌పీరియన్స్ చేసుకోదు. ఇదే ఆమెను డిస్టర్బ్ చేస్తుంది. ఆమె ఒక ఎంగేజ్మెంట్ పార్టీకి తన ఫ్రెండ్స్… షౌర్య (షెహనాజ్ గిల్), జీజా (డాలీ సింగ్), శ్రీ (కుశా కపిలా)తో పాటు తన ఎక్స్ లవర్స్‌ను ఇన్వైట్ చేస్తుంది. పార్టీలో ఒక మిస్టీరియస్ మనిషితో తన ఫస్ట్ నైట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంది. కణికా ఫియాన్సీ అంకిత్ (ప్రకాష్ ఠాకూర్)ను పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అవుతుంది. కానీ ఆమె ఎంగేజ్‌మెంట్ పార్టీలో జరిగిన సీక్రెట్ నైట్ గురించి, ఎక్స్ లవర్స్ గురించి… కృష్ణ (శర్వాని చిన్నాప్ప), మీరా (షిబానీ బేడి)తో కలిసి డిస్కస్ చేస్తారు.
కణికా తన ఎక్స్-లవర్స్‌తో ఫన్నీ, ఎమోషనల్ మొమెంట్స్ షేర్ చేస్తుంది. అంతేకాదు ఆమె ఎప్పుడూ ఆ ఎక్స్‌పీరియన్స్ చేసుకోలేదని వెల్లడిస్తుంది. ఆమె ఫ్రెండ్స్ ఆమెను సపోర్ట్ చేస్తారు. ఎంగేజ్‌మెంట్ పార్టీలో జరిగిన ఎక్స్‌పీరియన్స్ కణికాను షాక్ కు గురి చేస్తుంది. అదే విషయాన్ని ఆమె ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తుంది. అంతేకాదు తన లైఫ్ లో జరిగిన ఈ విషయాలను ఓపెన్ గానే డిస్కస్ చేస్తుంది. కానీ ఆమె ఫియాన్సీ అంకిత్ ఈ అమ్మాయిని, ఆమె ఓపెన్ నెస్ ను అర్థం చేసుకోలేకపోతాడు. దీంతో వీరిద్దరి రిలేషన్ దెబ్బతింటుంది. సినిమా ఫీల్-గుడ్ ఎండింగ్‌తో ముగుస్తుంది. కణికా ఆరోజు నైట్ కలిసిన వ్యక్తి ఎవరు? చివరికి ఏం జరిగింది ? అన్నది కథ.
Read Also : చెత్తకుప్పలో చిన్న పిల్లల శవాలు… అత్యంత క్రూరంగా చంపేసే సైకో… స్పైన్ చిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్