E-Paper
Advertisement

ఒక్క తప్పుతో నరాలు తెగే ఉత్కంఠ… శవం దాచడానికి పడరాని పాట్లు… ఓటీటీలో కేక పెట్టిస్తున్న క్రేజీ థ్రిల్లర్

ఒక్క తప్పుతో నరాలు తెగే ఉత్కంఠ… శవం దాచడానికి పడరాని పాట్లు… ఓటీటీలో కేక పెట్టిస్తున్న క్రేజీ థ్రిల్లర్
Advertisement

Thriller Series OTT : బెంగాలీ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయి. థ్రిల్లర్ కంటెంట్ ని రియలిస్టిక్ గా చూపించడంలో వీళ్ళు కూడా ఒక అడుగు ముందే ఉన్నారు. ఈ ఏడాది వచ్చిన ఒక పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ను చూస్తే మీకే తెలిసిపోతుంది. ఇందులో నలుగురు ఆడవాళ్లు అనుకోకుండా ఒక శవాన్ని మాయం చేసే ప్రాసెస్ లో లోకల్ గూండాలు, పోలీసుల కళ్లు గప్పి ఎలా బయటపడ్డారనేదే ఈ కథ. ఇందులో సీన్లు చాలా ఉత్కంఠంగా ఉంటాయి. ముఖ్యంగా మన ఆడవాళ్లు తిరగబడితే ఎలా ఉంటుందనేది ఈ సిరీస్ లో చాలా పవర్ ఫుల్ గా చూపించారు.

జీ 5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘కాళీపొట్కా’ (Kaalipotka). దీనికి అభిరూప్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇందులో స్వస్తిక ముఖర్జీ, శృతి దాస్, శ్రేయ భట్టాచార్య, హిమిక బోస్, అనిర్బన్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. సీనియర్ నటి స్వస్తిక ముఖర్జీ తన నటనతో సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లగా, శృతి దాస్, హిమిక బోస్, శ్రేయ భట్టాచార్య తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సిరీస్ కోసం వీళ్ళంతా కలిసి ఒక ర్యాప్ సాంగ్ పాడటం విశేషం. దర్శకుడు అభిరూప్ ఘోష్ ఈ సిరీస్‌ను చాలా రియాలిస్టిక్ గా తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ 2026 జనవరి 23న ZEE5 ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో విడుదలైంది. మొదటి సీజన్‌కు సంబంధించిన మొత్తం 7 ఎపిసోడ్‌లు అదే రోజున స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చాయి

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథలో శ్రీమ, రాణి, రింకూ, మినోటి అనే నలుగురు ఆడవాళ్లు ఉంటారు. వీళ్లంతా బతుకుదెరువు కోసం కష్టపడే మామూలు జనం. కానీ సీన్ ఎక్కడ రివర్స్ అవుతుందంటే, మినోటి మొగుడు అనుకోకుండా చచ్చిపోతాడు. భార్యా భర్తల గొడవలోనే అది జరుగుతుంది. ఇక మినోటి ఈ సంఘటనతో భయపడుతుంది. శవాన్ని ఎక్కడ పడేయాలో తెలియక, దాన్ని మాయం చేసే క్రమంలో ఈ నలుగురూ ఒక్కటవుతారు. అయితే ఇది వీళ్లని ఊహించని ఒక పెద్ద రొంపిలోకి లాగేస్తుంది.

ఆ శవాన్ని వదిలించుకుందాం అనుకునే లోపే, వీళ్లకి ఒక పాత క్రిమినల్ తగులుతాడు. వాడు మామూలోడు కాదు, వీళ్లని అడ్డంగా బుక్ చేసి ఆడుకోవాలని చూస్తాడు. అటు పోలీసులు, ఇటు లోకల్ గూండాలు అందరూ వీళ్ల వెంటే పడతారు. చచ్చినోడి శవం ఒకవైపు, వీళ్ల ప్రాణాల మీదకి వచ్చే గొడవలు ఇంకోవైపుతో కథంతా ఫుల్ టెన్షన్ తో, ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. చివరికి వీళ్ళు ఆ శవాన్ని మాయం చేశారా ? వీళ్ళకి ఆ క్రిమినల్ కి సంబంధం ఏమిటి ? మినోటి భర్త ఎలా చనిపోయాడు ? పోలీసులకు విషయం తెలుస్తుందా ? అనే విషయాలను మాత్రం ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఆమె కౌగిలిలో చిక్కితే ప్రాణాలు గాల్లోనే… ఈ సినిమా సింగిల్స్ కి మాత్రమే

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×