E-Paper
Advertisement

Thriller Movie OTT: ఓటీటీలోకి మరో మలయాళం థ్రిల్లర్… నవ్య నాయర్-సౌబిన్ షాహిర్ కాప్ థ్రిల్లర్… ఎక్కడ చూడవచ్చు అంటే?

Thriller Movie OTT: ఓటీటీలోకి మరో మలయాళం థ్రిల్లర్… నవ్య నాయర్-సౌబిన్ షాహిర్ కాప్ థ్రిల్లర్… ఎక్కడ చూడవచ్చు అంటే?
Advertisement

Thriller Movie OTT : ఎట్టకేలకు మలయాళ నటి నవ్య నాయర్, సౌబిన్ షాహిర్ నటించిన మలయాళ థ్రిల్లర్ ‘పాతిరాత్రి’ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. మహిళా దర్శకురాలు తీనా పిటి దర్శకత్వం వహించిన రెండవ చిత్రం కూడా ఇదే. మొదటిది మమ్ముట్టి ‘పుజు’ సినిమాతో అరంగేట్రం చేసింది ఈ అమ్మడు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో అడుగు పెట్టాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఇప్పుడు నాలుగు నెలల తరువాత ఓటీటీలోకి వస్తోంది. ఒక నైట్ పెట్రోలింగ్ సమయంలో జరిగిన ఒక మిస్టీరియస్ సంఘటన వల్ల ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల జీవితాలు ఎలా మారాయి అనేదే ఈ సినిమా కథ. ఇందులో నవ్య నాయర్ ఎస్.ఐ పాత్రలో, సౌబిన్ షాహిర్ కానిస్టేబుల్ పాత్రలో నటించారు.

ఎక్కడ చూడచ్చు అంటే

మలయాళ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ ‘పాతిరాత్రి’ (Paathirathri) సినిమా ‘పుజు’ ఫేమ్ తీనా పిటి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, నవ్య నాయర్, సన్నీ వేన్, ఆన్ అగస్టిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. బెంజీ ప్రొడక్షన్స్ తరపున కెవి అబ్దుల్ నాజర్, ఆషియా నాజర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది 2025 అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైంది. ఫిబ్రవరి 13న ఓటీటీ లో రిలీజ్ కావాల్సి ఉండగా, ఈ చిత్రం డిజిటల్ విడుదల కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. ఈ థ్రిల్లర్ ఇప్పుడు ఫిబ్రవరి 20న ఉదయం 12 గంటల నుండి ZEE5 ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఎస్.ఐ జాన్సీ (నవ్య నాయర్), కానిస్టేబుల్ హరీష్ (సౌబిన్ షాహిర్) ఒక రోజు అర్ధరాత్రి పెట్రోలింగ్‌లో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక వింత సంఘటనను చూస్తారు. ఆ సమయంలో వాళ్ళు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఆ విషయాన్ని దాచిపెట్టాల్సి వస్తుంది. కానీ ఆ సీక్రెట్ వాళ్ళని వదిలిపెట్టదు. ఒకవైపు డిపార్ట్‌మెంట్ ఒత్తిడి, మరోవైపు పర్సనల్ లైఫ్ సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళకి, ఆ రాత్రి జరిగిన సంఘటన ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ కేసుగా మారి ప్రాణాల మీదకు వస్తుంది. కథ ముందుకు వెళ్లేకొద్దీ, ఆ రాత్రి వాళ్ళు చూసింది ఏమిటి? అసలు నిందితులు ఎవరు? దీని నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు? అనే విషయాలు ఉత్కంఠంగా బయటపడుతుంటాయి.

Read Also : అమ్మాయిల్ని హింసించి చంపే కిల్లర్… చచ్చాక బట్టల్లేకుండా బయట పడేసే క్రూరత్వం… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×