E-Paper
Advertisement

Bhupalpally: భూపాలపల్లిలో ఘోర ప్రమాదం.. రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

Bhupalpally: భూపాలపల్లిలో ఘోర ప్రమాదం.. రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకుల మృతి
Advertisement

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. భూపాలపల్లి – కాళేశ్వరం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రెండు బైక్‌లు వేగంగా వచ్చి ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు బైక్‌లపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.

మృతులను భూపాలపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గాదె మహేష్‌గా.. గణపురం గ్రామానికి చెందిన రెబ్బ శ్రీకాంత్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఎదురెదురుగా వస్తున్న వాహనాలు అతివేగంతో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో నర్సింగాపూర్.. గణపురం గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: Viral Video: ఇదెక్కడి పైత్యం.. బతికున్న భర్తను తల వరకూ పూడ్చి.. నెత్తిన పాలాభిషేకం చేసిన భార్య

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×