Vikrant Gupta: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా మంగళవారం రోజున సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Sunrisers Hyderabad vs Delhi Capitals) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం ( Rajiv Gandhi International Stadium, Hyderabad) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ పైన ఏకంగా 47 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది హైదరాబాద్. దీంతో పాయింట్ల పట్టికలో కూడా మూడో స్థానానికి ఎగబాకింది.
Also Read: Javed Miandad: ఫర్హాన్ దెబ్బకు బుమ్రా కెరీర్ నాశనం..పాకిస్తాన్ తో పెట్టుకుంటే తొక్కిపడేస్తాం Javed Miandad
అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మపై ( Abhishek Sharma ) స్పోర్ట్స్ అనలిస్ట్, సీనియర్ విలేఖరి విక్రాంత్ గుప్తా ( Vikrant Gupta) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ సెంచరీ చేశాడు బాగానే ఉంది.. కానీ స్లోగా బ్యాటింగ్ చేశాడని మండిపడ్డారు. టెస్ట్ ప్లేయర్ లాగా బ్యాటింగ్ చేసి, సెంచరీ నమోదు చేయడం అభిషేక్ శర్మ స్టైల్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అభిషేక్ శర్మ మరింత దూకుడుగా ఆడి ఉంటే హైదరాబాద్ 260 కి పైగా పరుగులు చేసేదని విక్రాంత్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో విక్రాంత్ గుప్తా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ మ్యాచ్ జరిగింది. ఇందులో 45 బంతుల్లోనే సెంచరీ చేసిన అభిషేక్ శర్మ… ఇరగదీశాడు. ఈ మ్యాచ్ ఫినిష్ అయ్యేసరికి 10 సిక్సర్లు, 10 బౌండరీలు కొట్టి 135 పరుగులకు చేరుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో అతని స్ట్రైక్ రేట్ 198గా మాత్రమే ఉంది. గతంలో ఆడినంత దూకుడు అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో ప్రదర్శించలేదు. కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ చేశాడు. ఇదే విషయం పైన సీనియర్ జర్నలిస్టు విక్రాంత్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అభిషేక్ శర్మ గతంలో లాగా ఫాస్ట్ గా ఆడలేదని.. లయ తప్పి టెస్ట్ ప్లేయర్ లాగా ఆడినట్లు కనిపించిందని విమర్శలు చేశారు. కాస్త దూకుడుగా ఆడి ఉంటే బాగుండేదని సూచనలు చేశారు. అభిషేక్ శర్మ దూకుడుగా ఆడి ఉంటే హైదరాబాద్ 260 కి పైగా స్కోర్ చేసేది అన్నారు. ఇకనైనా అభిషేక్ శర్మ ఫాస్ట్ గా ఆడాలని కోరారు. కాగా ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది ఢిల్లీ క్యాపిటల్స్. అటు విజయం సాధించిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
What a brilliant knock by Abhishek Sharma – a bit ‘slow’ by his standards but with almost 6 overs to go Sunrisers Hyderabad should target 260 and shut the doors on Delhi#SRHvsDC
— Vikrant Gupta (@vikrantgupta73) April 21, 2026