E-Paper
Advertisement

పగలు రుచికరమైన భోజనం… రాత్రి భయంకరమైన ఆత్మల వేట… అదరగొడుతున్న యాక్షన్ థ్రిల్లర్

పగలు రుచికరమైన భోజనం… రాత్రి భయంకరమైన ఆత్మల వేట… అదరగొడుతున్న యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Action Series OTT: పక్కా మాస్ మసాలా బిర్యానీ లాంటి సిరీస్ ఓటీటీలో ఉంది భయ్యా. దీనిని చూస్తుంటే థమ్స్ అప్ తో బిర్యానీ తిన్నట్టే ఉంటుంది. ఈ కథ పగలు నూడిల్స్ అమ్ముకునే సాదాసీదా మనుషులు, చీకటి పడితే చాలు దెయ్యాలను పచ్చడి చేస్తుంటారు. వంద మంది వచ్చినా గాలిలో ఎగిరి తన్నే ఫైట్లు, ఒళ్లు గగుర్పొడిచే గ్రాఫిక్స్, దీనికి తోడు ఎమోషనల్ సెంటిమెంటు.. అన్నీ కలిపి ఒక లెవల్‌లో ఉంటుంది ఈ సిరీస్. ఒక్క మాటలో చెప్పాలంటే, అన్యాయం చేసే దెయ్యాలకి, గూబ పగిలేలా బుద్ధి చెప్పే సూపర్ హీరోల కథ ఇది. ఇందులో దెయ్యాలను వేటాడేటప్పుడు వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

కొరియన్ యాక్షన్ ఫాంటసీ వెబ్ సిరీస్ పేరు ‘ది అన్‌కానీ కౌంటర్’ (The Uncanny Counter). ఈ సిరీస్ కొరియాలో ఎంత హిట్ అయ్యిందంటే, అక్కడి OCN ఛానెల్‌ చరిత్రలోనే అత్యధిక రేటింగ్స్ సాధించిన డ్రామాగా నిలిచింది.  ఇక ఇందులో హీలింగ్ పవర్ ఉన్న పాత్ర వేసిన యోమ్ హై-రాన్ తన నటనకు గాను ప్రతిష్టాత్మకమైన బేక్సాంగ్ ఆర్ట్ అవార్డును గెలుచుకున్నారు. అలాగే రెండో సీజన్‌ను మరింత మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందించారు. మరో విశేషం ఏంటంటే, ఇందులో నటించిన మెయిన్ లీడ్స్ అందరూ షూటింగ్ కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా హీరో జో బ్యోంగ్-గ్యు చాలా వరకు రిస్కీ ఫైట్లను డూప్ లేకుండానే చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది తెలుగు డబ్బింగ్‌లో అందుబాటులో ఉండటం మన ఆడియన్స్ కు పెద్ద ప్లస్ పాయింట్. ఇది సీజన్ :1, 2020లో 16 ఎపిసోడ్స్ తో, సీజన్ 2 : 12 ఎపిసోడ్స్ తో 2023లో వచ్చింది. ఈ రెండూ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు ఆడియోతో కూడా అందుబాటులో ఉన్నాయి.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక నూడిల్స్ షాపును నలుగురు మనుషులు నాడుపుతుంటారు. వాళ్ళు మామూలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వాళ్ళు అసలు సిసలు దెయ్యాల వేటగాళ్ళు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లకుండా, భూమి మీద తిరుగుతూ మనుషుల్ని చంపేసే క్రూరమైన దెయ్యాలను ఏరి పారేయడమే వీళ్ల డ్యూటీ. వీళ్లకి పైలోకం నుంచి కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి. ఒకడికి కొడితే గూబ గుయ్ మనేంత బలం, ఒకమ్మాయికి మైళ్ల దూరంలో ఉన్న దెయ్యం వాసన కనిపెట్టే తెలివి, ఇంకోఅమ్మాయికి చచ్చినోణ్ణి కూడా బతికించేంత హీలింగ్ పవర్ ఉంటుంది.

ఇక ఇందులో హీరో సో మున్ ఒక మామూలు కుర్రాడు. చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్‌లో కాళ్లు పోయి, పాపం కర్ర పట్టుకుని నడుస్తుంటాడు. అలాంటి వాడిలోకి ఒకరోజు ఒక పవర్ వచ్చి చేరుతుంది. దాంతో అతనికి ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. కుంటి కాళ్లు పోయి రన్నింగ్ రేసులో ఉరికేంత బలం వస్తుంది. అలా ఆ దెయ్యాల వేటగాళ్ల గ్రూపులో మనోడు మెయిన్ మెంబర్ అయిపోతాడు. ఈ దెయ్యాలను కొట్టేటప్పుడు గాలిలో పల్టీలు కొడుతూ, బిల్డింగ్‌ల మీద నుంచి దూకుతూ చేసే ఫైట్లు చూస్తే పూనకాలు వచ్చేస్తాయి.

Advertisement

ఈ వేట ఇలా సాగుతుండగా, హీరోకి ఒక విషయం తెలుస్తుంది. తను చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్‌లో వాళ్ల అమ్మనాన్నలు చనిపోవడానికి కారణం మామూలు మనుషులు కాదు, ఒక పవర్‌ఫుల్ దెయ్యం అని తెలుస్తుంది. అప్పటినుంచి ఆ దెయ్యం అరాచకాలను ఆపడానికి, తన ఫ్యామిలీకి న్యాయం చేయడానికి హీరో అండ్ టీం కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి వీళ్ళు ఆ దెయ్యాల ఆట కట్టిస్తారా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Aslo : సైకో కిల్లర్ చేతిలో చిక్కుకున్న సైకాలజిస్ట్… 60 నిమిషాల డెడ్లైన్ తో అల్లకల్లోలం

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×