E-Paper
Advertisement

హర్మూజ్ జలసంధికి ట్రంప్ పర్మనెంట్ అన్-లాక్.. పాస్‌వర్డ్ చైనాకు షేర్ చేసిన డొనాల్డ్!

హర్మూజ్ జలసంధికి ట్రంప్ పర్మనెంట్ అన్-లాక్.. పాస్‌వర్డ్ చైనాకు షేర్ చేసిన డొనాల్డ్!
Advertisement

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో అంతర్జాతీయ రాజకీయాలను మరోసారి వేడెక్కించారు. వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) తాను శాశ్వతంగా తెరుస్తున్నానని, దీనివల్ల చైనా చాలా సంతోషంగా ఉందని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ జలసంధి ఇకపై ఎన్నటికీ దిగ్బంధానికి గురికాదని ఆయన ప్రపంచానికి భరోసా ఇచ్చారు. “నేను ఇది వారి (చైనా) కోసం, ప్రపంచం కోసం చేస్తున్నాను. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ రావు.” అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయకూడదని చైనా అంగీకరించిందని ట్రంప్ ఈ సందర్భంగా వెల్ల‌డించారు. ఇరాన్‌కు చైనా గగనతల రక్షణ వ్యవస్థలను ( సరఫరా చేస్తోందని సిఎన్ఎన్ (CNN) నివేదించగా, అమెరికా మిలిటరీ బేస్‌లను టార్గెట్ చేయడానికి ఇరాన్ చైనా గూఢచారి ఉపగ్రహాలనువాడుతోందని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. అయితే, ఇరాన్‌కు ఎలాంటి సైనిక సహకారం అందించడం లేదని చైనా విదేశాంగ శాఖ పదేపదే ఖండిస్తోంది.

Advertisement

వచ్చే మే 14, 15 తేదీల్లో ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తనకు “బిగ్, ఫ్యాట్ హగ్” (పెద్ద కౌగిలింత) ఇస్తారని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. “మేము చాలా స్మార్ట్‌గా, కలిసి పని చేస్తున్నాం. ఇది యుద్ధం కంటే మంచిది కదా? కానీ గుర్తుంచుకోండి. అవసరమైతే మేము యుద్ధం చేయడంలో అందరికంటే మేటి.” అని తనదైన శైలిలో హెచ్చరిక కూడా జారీ చేశారు. 2017 తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి కానుంది. గత అక్టోబర్‌లో దక్షిణ కొరియాలో జరిగిన భేటీ తర్వాత వీరిద్దరూ నేరుగా కలుసుకోవడం ఇదే తొలిసారి.

మరోవైపు, ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్బంధించడాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. అమెరికా చర్యలు “ప్రమాదకరమైనవి.. బాధ్యతారాహిత్యమైనవి” అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ విమర్శించారు. ఇరాన్‌పై సైనిక మోహరింపులు పెంచడం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని, ఇది ఇప్పటికే బలహీనంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీస్తుందని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రాచ్యంలో శాంతిని పెంపొందించడంలో చైనా “నిర్మాణాత్మక పాత్ర” పోషిస్తుందని జిన్‌పింగ్ హామీ ఇచ్చారు.

Advertisement

Read Also: హర్మూజ్ జలసంధిలో అమెరికాకు భారీ దెబ్బ.. రూ. 2200 కోట్ల డ్రోన్ గల్లంతు!

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×