E-Paper
Advertisement

Action Thriller OTT : మాఫియాకి ముచ్చెమటలు పట్టించే బాక్సింగ్ బ్రదర్స్… ప్రతీ ఎపిసోడ్ క్రేజీగా… ఐయండిబిలో 8.1రేటింగ్

Action Thriller OTT : మాఫియాకి ముచ్చెమటలు పట్టించే బాక్సింగ్ బ్రదర్స్… ప్రతీ ఎపిసోడ్ క్రేజీగా…  ఐయండిబిలో 8.1రేటింగ్
Advertisement

Action Thriller OTT : కొరియన్ డ్రామాలకు ఇప్పుడు క్రేజ్ చాలానే ఉంది. రొమాంటిక్ నుంచి, యాక్షన్ ల వరకు వేటినీ వదలట్లేదు అభిమానులు. ఈ నేపథ్యంలో ఒక యాక్షన్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్, అద్భుతమైన బాక్సింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఇంట్రెస్టింగ్ గా ఉటుంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న సామాన్యులను వేధించే ఒక క్రూరమైన వడ్డీ వ్యాపారిని, ఎదిరించే ఇద్దరు బాక్సర్ల చుట్టూ ఈ కథ ఉంటుంది. ఒక్క ఎపిసోడ్ చూసినా మాస్ మరో లెవెల్ అన్నట్లు ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ కొరియన్ యాక్షన్ సిరీస్ పేరు ‘బ్లడ్ హౌండ్స్’ (Bloodhounds). ఇందులో ప్రధాన పాత్రల్లో వూ దో-హ్వాన్, లీ సాంగ్-యి నటించారు. విలన్ పాత్రలో పార్క్ సుంగ్-వూంగ్ అద్భుతంగా నటించారు. 2023లో నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదలైన మంచి గుర్తింపు పొందింది. ఈ సిరీస్. ఈ సిరీస్ భారీ విజయాన్ని సాధించడంతో నెట్‌ఫ్లిక్స్ రెండవ సీజన్‌ను ప్రకటించింది. సీజన్ 2, 2026ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఇందులో ప్రముఖ నటుడు రెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. దీనికి ఐయండిబిలో 8 కి పైగా రేటింగ్ కూడా ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హీరో గన్-వూ ఒక అమాయకపు బాక్సింగ్ కుర్రాడు. కరోనా టైమ్‌లో వాళ్ల అమ్మ నడుపుతున్న చిన్న హోటల్ నష్టాల్లో ఉంటుంది. సరిగ్గా అదే టైమ్‌లో కిమ్ అనే ఒక క్రూరమైన వడ్డీ వ్యాపారి తక్కువ వడ్డీకే అప్పు ఇస్తాననని నమ్మించి గన్-వూ వాళ్ల అమ్మను నిలువునా ముంచేస్తాడు. అప్పు కట్టలేదని ఆ రౌడీలు వచ్చి హోటల్‌ను పగలగొట్టి, అడ్డువచ్చిన గన్-వూ ముఖం మీద కత్తితో పెద్ద గాటు పెట్టి నానా బీభత్సం చేస్తారు. తన తల్లిని ఏడిపించి, తన ముఖం పాడు చేసిన ఆ వడ్డీ మాఫియాని నరికి పారేయాలని గన్-వూ కసితో రగిలిపోతాడు. ఒంటరిగా వెళ్తే పని అవ్వదని తెలిసిన గన్-వూకి, బాక్సింగ్ రింగులో పరిచయమైన తన దోస్త్ వూ-జిన్ తోడవుతాడు.

వీళ్ళిద్దరూ కలిసి ప్రెసిడెంట్ చోయ్ అనే ఒక పెద్దాయన దగ్గర పనికి కుదురుతారు. ఆ పెద్దాయన ఒకప్పుడు మనీలెండింగ్ సెక్టార్‌లో తోపు, కానీ ఇప్పుడు మంచిగా మారిపోయి పేదోళ్లకి వడ్డీ లేకుండా సాయం చేస్తుంటాడు. విలన్ కిమ్ కి, ఈ పెద్దాయనకి పాత పగలు ఉంటాయి. దాంతో మన బాక్సర్లిద్దరూ ఆ పెద్దాయనకి కుడి ఎడమ భుజాల్లా మారి, బాక్సింగ్ పంచులతో విలన్ దగ్గర ఉండే రౌడీల దవడలు పగలగొడుతూ వాడి సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా కూల్చేస్తుంటారు. అయితే క్లైమాక్స్‌లో విలన్ ప్రెసిడెంట్ చోయ్‌ని, ఆయన మనుషుల్ని చంపేస్తాడు. దీంతో హీరోలిద్దరికీ పిచ్చెక్కిపోతుంది. చివరికి ఈ ఇద్దరు బాక్సర్ కుర్రాళ్లు ఆ పెద్ద రౌడీ గ్యాంగ్‌ని ఎలా మట్టికరిపించారనేదే ఈ అసలు సిసలైన యాక్షన్ స్టోరీ క్లైమాక్స్.

Advertisement

Read Also :  ఓటీటీలోకి ఉత్కంఠ పెంచే మర్డర్ కేసు… డెడ్ లైన్ పెట్టే ఏఐ జడ్జి… తెలుగులోనూ స్ట్రీమింగ్

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×