E-Paper
Advertisement

Science Fiction Thriller Movie OTT : ఓటీటీలోకి ఉత్కంఠ పెంచే మర్డర్ కేసు… డెడ్ లైన్ పెట్టే ఏఐ జడ్జి… తెలుగులోనూ స్ట్రీమింగ్

Science Fiction Thriller Movie OTT : ఓటీటీలోకి ఉత్కంఠ పెంచే మర్డర్ కేసు… డెడ్ లైన్ పెట్టే ఏఐ జడ్జి… తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

Science Fiction Thriller Movie OTT : ఈ టెక్నాలజీ యుగంలో సినిమాలు చాలా అడ్వాన్స్ గా తెరకెక్కుతున్నాయి. ఇక సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఫ్యూచర్ కి తగ్గట్టు వాడేస్తున్నారు. ఇప్పుడు Ai సినిమాలు ఓ మంచి ఊపు మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక హాలీవుడ్ సినిమా థ్రిల్లర్ కంటెంట్ తో వచ్చింది. ఈ సినిమా భవిష్యత్తులో లాస్ ఏంజిల్స్ నగరంలో జరుగుతుంది. అక్కడ నేరస్తులకు తీర్పు చెప్పడానికి మనుషులకు బదులుగా, అత్యంత అధునాతనమైన AI జడ్జి వ్యవస్థను ఉపయోగిస్తుంటారు. ఇక కథ కూడా ఒక మర్డర్ కేసు చుట్టూ తిరుగుతూ థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. థ్రిల్లర్ ఫిన్స్ కి భలే మజా ఇస్తోంది ఈ సినిమా. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మెర్సీ’ (Mercy). ఇది 2026 జనవరి 23న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ రెండు నెలల తరువాత మార్చి 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రానికి బెక్మంబెటోవ్ దర్శకత్వం వహించగా, ఈ మూవీని అట్లాస్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఇందులో క్రిస్ ప్రాట్, రెబెకా ఫెర్గూసన్, రీస్, అనబెల్ వాలిస్, క్రిస్ తదితరులు నటించారు. ఈ మూవీ ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

భవిష్యత్తులో లాస్ ఏంజిల్స్ నగరంలో నేరస్తులకు తీర్పులు చెప్పే అధికారం మనుషుల దగ్గర కాకుండా, ఒక శక్తివంతమైన AI జడ్జి చేతిలో ఉంటుంది. ఈ క్రమంలో ఒక సీనియర్ డిటెక్టివ్ తన భార్యను హత్య చేశాడని ఆ AI వ్యవస్థ పొరపాటున తేలుస్తుంది. అతనికి తక్షణమే మరణశిక్ష విధించేలా ఆ సిస్టమ్ ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆ డిటెక్టివ్‌కు కేవలం 90 నిమిషాల సమయం మాత్రమే దొరుకుతుంది. ఆ గంటన్నర లోపు తను తప్పు చేయలేదని సాక్ష్యాలతో సహా నిరూపించలేకపోతే అతను ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఒక పక్క పోలీసులు, మరోపక్క అత్యాధునిక టెక్నాలజీ తనని వెంటాడుతుండగా.. అసలైన హంతకుడిని డిటెక్టివ్ ఎలా పట్టుకున్నాడు ? ఆ AI జడ్జిని ముందు తాను నిర్దోషినని ఎలా నిరూపించికున్నాడనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : మదర్ బెస్ట్ ఫ్రెండ్ కూతురితో ప్రేమలో… స్నేహితుడితోనే ప్రేమ పాఠాలు… పక్కా రొమాంటిక్ ఎంటర్టైనర్

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×