E-Paper
Advertisement

Action Thriller OTT : ఏడేళ్ళ తర్వాత తమ్ముడి చావుకి రివేంజ్… అండర్ వరల్డ్‌లో అన్న అరాచకం… ఒక్కొక్కడికీ దబిడి దిబిడే

Action Thriller OTT : ఏడేళ్ళ తర్వాత తమ్ముడి చావుకి రివేంజ్… అండర్ వరల్డ్‌లో అన్న అరాచకం… ఒక్కొక్కడికీ దబిడి దిబిడే
Advertisement

Action Thriller OTT : ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్ మధ్య తిరిగే ఒక ఇంటెన్స్ యాక్షన్ సినిమా ఓటీటీలో దుమ్ము లేపుతోంది. ఈ సినిమా అండర్‌వరల్డ్ గ్యాంగ్ ను ఎదుర్కొనే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. యాక్షన్ థ్రిల్లర్ లవర్స్‌కి మస్త్ వాచ్ మూవీగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘డార్క్ లాండ్ : కేస్ క్లోజ్డ్’ (Darkland: Case Closed) 2023లో విడుదలైన డానిష్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దీనిని Darkland: The Return, Underverden II అని కూడా పిలుస్తారు. ఫెనార్ అహ్మద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దార్ సలీమ్, బిర్గిట్టే హిజోర్ట్ సోరెన్సన్, స్టైన్ ఫిషర్ క్రిస్టెన్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 2023 ఏప్రిల్ 13న డెన్మార్క్‌ థియేటర్లలో విడుదలైంది. ఇది 2017లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘Darkland’కు సీక్వెల్. ఇది ప్రస్తుతం prime videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మొదటి పార్ట్ లో జైద్ అనే వ్యక్తి తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో సాగుతుంది. అందులో జైద్ చేసిన హింసకు ఏడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తాడు. ఈ సమయంలో అతను తన భార్యకు, తన ఏడేళ్ల కొడుకు నోవాకు పూర్తిగా దూరమవుతాడు. ఒకరోజు జైలులో ఉన్న జైద్‌ను హెల్లె అనే పోలీస్ ఏజెంట్ కలుస్తుంది. కోపెన్‌హాగన్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ఒక శక్తివంతమైన గ్యాంగ్ లీడర్ ముదీర్‌ను పట్టుకోవడానికి, అండర్ కవర్ ఏజెంట్‌గా వెళ్లాలని ఆమె అతన్ని కోరుతుంది. ఇందుకు ప్రతిఫలంగా జైద్‌కు జైలు నుండి బయటపడే మార్గంతో పాటు, అతని కొడుకును కలుసుకునే అవకాశం కల్పిస్తామని పోలీసులు ఒప్పందం చేసుకుంటారు.

తన కొడుకు కోసం జైద్ ఈ ప్రమాదకరమైన పనికి ఒప్పుకుంటాడు. అతను అండర్ కవర్ లోకి వెళ్ళి ముఠా నాయకుడి ముదీర్ నమ్మకాన్ని పొందుతాడు. అయితే ఈ ఆపరేషన్ చివరి దశలో, ముదీర్‌కు జైద్ అసలు నిజం తెలిసిపోతుంది. జైద్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ముదీర్‌తో పోరాడాల్సి వస్తుంది. చివరికి ముదీర్ సామ్రాజ్యాన్ని జైద్ కూలుస్తాడా ? తన కొడుకును కలసుకుంటాడా ? అనే విషయాలను ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  ట్రాన్స్ లేటర్ తో హీరోయిన్ తమాషా ప్రేమకథ… రొమాన్స్ తో పాటు కామెడీ కూడా

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×