E-Paper
Advertisement

Romantic Comedy K-Drama : ట్రాన్స్ లేటర్ తో హీరోయిన్ తమాషా ప్రేమకథ… రొమాన్స్ తో పాటు కామెడీ కూడా

Romantic Comedy K-Drama : ట్రాన్స్ లేటర్ తో హీరోయిన్ తమాషా ప్రేమకథ… రొమాన్స్ తో పాటు కామెడీ కూడా
Advertisement

Romantic Comedy K-Drama : నెట్‌ఫ్లిక్స్ కొరియన్ డ్రామాలతో ఇప్పుడు ప్రేక్షకులు సేద తీరుతున్నారు. ఈ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. నిజానికి ఇవి చూడటానికి ఆసక్తిగా ఉంటున్నాయి. అసభ్యత కూడా తక్కువే ఉంటోంది. కాబట్టి ఫ్యామిలీలతో కూడా ఈ సిరీస్లను ఎంచక్కా చూసేయచ్చు కూడా. రీసెంట్ గా ఓ కొత్త కొరియన్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. ఈ సిరీస్ ఇప్పటికే ప్రజాదరణను పొంది, టాప్ ట్రెండింగ్ లో చోటు సంపాదించుకుంది. అంతే కాదు, ఈ కొరియన్ వెబ్ సిరీస్ ఐయండిబిలో మంచి రేటింగ్ కూడా పొందింది. ఈ సిరీస్ పేరు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న రొమాంటిక్ కామెడీ కొరియన్ సిరిస్ పేరు ‘కెన్ దిస్ లవ్ బి ట్రాన్స్‌లేట్’ (Can This Love Be Translated). కొరియన్ సూపర్ స్టార్స్ కిమ్ సియోన్-హో, గో యంగ్-జంగ్ నటించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో రీసెంట్ గా, అంటే జనవరి 16 నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో అడుగు పెట్టిన వెంటనే, ఈ రొమాంటిక్ సిరీస్ టాప్ 3లో ట్రెండింగ్ అవుతోంది. ఐయండిబిలో దీనికి 8.3/10 రేటింగ్ ఉందంటే ఈ సిరీస్ ఎలా ఉంటుందో అంచనా వేయచ్చు.

స్టోరీ ఏమిటంటే ?

Advertisement

జూ హో-జిన్ ఇతను ఒక ప్రతిభ గల ట్రాన్స్‌లేటర్. ఇంగ్లీష్, జపనీస్, ఇటాలియన్ వంటి అనేక భాషల్లో ఇతనికి పట్టు ఉంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అతను పని చేస్తుంటాడు. చా ము-హీ అనే ఒక గ్లోబల్ సూపర్ స్టార్ నటికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ము-హీ తన అంతర్జాతీయ ప్రాజెక్టుల కోసం హో-జిన్‌ను తన వ్యక్తిగత ట్రాన్స్‌లేటర్ గా నియమించుకుంటుంది. వీరిద్దరూ కలిసి వివిధ దేశాలకు ప్రయాణిస్తారు. ము-హీ చెప్పే మాటలను హో-జిన్ యథాతథంగా అనువదిస్తాడు. కానీ ఆ మాటల వెనుక ఉన్న ఆమె అసలు భావాలను గ్రహించలేకపోతాడు. ఇక వేర్వేరు భాషా నేపథ్యాలు ఉన్న వీరిద్దరి మధ్య మాటల అనువాదంలో రకరకాల ఇబ్బందులు వస్తాయి. అలాగే వీళ్ళు ప్రేమలో కూడా పడతారు. కథలో ఒక జపనీస్ నటుడు ఎంట్రీ తో స్టోరీ మరిన్ని మలుపులు తిరుగుతుంది. చివరికి హో-జిన్, ము-హీల ప్రేమ కథ సుఖాంతం అవుతుందా ? ట్రాన్స్‌లేటర్ గా హో-జిన్ కి ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను ఈ రొమాంటిక్ కామెడీ కొరియన్ సిరిస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : దేవకన్యతో డిటెక్టివ్ ప్రేమ… విజువల్ వండర్ ఈ ఫాంటసీ సిరీస్

Tags

Related News

నెట్‌ఫ్లిక్స్ ప్రియులకు పండగ… ఒకే రోజు ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్… అన్నీ తెలుగులోనే

ఈ వారం ఓటీటీని షేక్ చేస్తున్న 5 క్రేజీ మలయాళం సినిమాలు, సిరీస్‌లు ఇవే… తెలుగులోనూ స్ట్రీమింగ్

తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు

క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్

ప్రాంక్ కాస్తా క్రేజీ అడ్వెంచర్ గా మారితే… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

భార్య తప్పును తలపై వేసుకుని జైలుకు… హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ధమాకా

అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్‌… రాంగ్ టర్న్ తో డైరెక్ట్ గా నరకంలోకి… బోన్ చిల్లింగ్ ట్విస్టులు

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×