SRH VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ.. రెండో మ్యాచ్ లో మాత్రం ఇరగదీసింది. కోల్కత్తా గడ్డపై కేకేఆర్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించి.. మంచి ఊపులో ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఆదివారం రోజున లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో మరో కీలక మ్యాచ్ ఆడనుంది హైదరాబాద్. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటికే రెండు జట్లు కూడా ఉప్పల్ స్టేడియానికి వెళ్లి, ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఆదివారం మధ్యాహ్నం పోరుకు సిద్ధం కానున్నాయి.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో భాగంగా హైదరాబాద్ మరో మ్యాచ్ కు సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు లక్నోతో తలపడనుంది. మిట్ట మధ్యాహ్నం మ్యాచ్ ఉన్న నేపథ్యంలో వర్షం పడే ప్రభావం లేనట్లే తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఆదివారం రోజున వర్షం పడే అవకాశాలు లేనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా చూడవచ్చు. హోమ్ గ్రౌండ్ కాబట్టి హైదరాబాద్ విన్ అయ్యే ఛాన్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు ఇప్పటికే తొలి మ్యాచ్ లో ఓడిపోయిన లక్నో సూపర్ జెయింట్స్ హైదరాబాద్ వేదికగా గెలవడం కష్టమే అని అంటున్నారు.
కానీ పాత రికార్డులు మాత్రం లక్నో గెలుస్తాయని చెబుతున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు గట్ల మధ్య ఆరు సార్లు ఫైట్ జరిగింది. ఇందులో కేవలం రెండుసార్లే హైదరాబాద్ గెలిచింది. ఆరుసార్లు మ్యాచ్ జరిగితే నాలుగు సార్లు లక్నో విజయం సాధించడం గమనార్హం. ఈ రెండు జట్ల మధ్య హైయెస్ట్ స్కోర్ 205 మాత్రమే. మరి ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ ఎలా ఆడుతుందో చూడాలి. ప్రస్తుతమైతే హైదరాబాద్ బ్యాటర్లు మంచి ఫామ్ లో ఉన్నారు. SRH ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 300 కొట్టే ఛాన్సులు ఉన్నాయి.
హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కొన్ని వస్తువులపై నిషేధం విధించారు. స్టేడియం వద్ద క్లాక్ రూమ్ ఉండబోదని వెల్లడించిన పోలీసులు.. నిషేధిత వస్తువులు తీసుకురాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ల్యాప్టాప్ లు, కెమెరాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, హ్యాండ్ బ్యాగులు, బ్యాక్ ప్యాక్స్, హెల్మెట్లు, ఇయర్ ప్యాడ్స్, కీ-చైన్లు, పెన్నులు, పదులైన వస్తువులు, ఆయుధాలు, వాటర్ బాటిల్స్ తీసుకురాకూడదు. అలాగే అగ్గిపెట్టెలు, సిగరెట్లు, లైటర్స్, అలాగే బ్యానర్లు లాంటివి తీసుకురాకూడదని లిస్ట్ రిలీజ్ చేశారు హైదరాబాద్ పోలీసులు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==