E-Paper
Advertisement

Action Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన త‌మిళ యాక్షన్ థ్రిల్ల‌ర్‌ … నెత్తురుడికించే రివేంజ్ స్టోరీ

Action Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన త‌మిళ యాక్షన్ థ్రిల్ల‌ర్‌ … నెత్తురుడికించే రివేంజ్ స్టోరీ
Advertisement

Action Thriller OTT : పొట్టేల్ ఫైట్ నేపథ్యంలో వచ్చిన ఒక తమిళ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై , మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఐఎండీబీలో దీనికి 8 రేటింగ్ ఉండటం విశేషం. సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించినా, కొన్ని కారణాలవల్ల మూవీ వాయిదా పడింది. చివరకు 2026 జనవరి 23న థియేటర్లకు వచ్చింది. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ని పలకరిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్ళు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ప్రగభల్ దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘జాకీ’ (Jackey). ఇందులో యువన్ కృష్ణ, రిధాన్ కృష్ణాస్, అమ్ము అభిరామి, మధుసూధన్ రావు, సీతన్ మోహన్, శరణ్య రవి కీలకపాత్రలు పోషించారు. పీకే7 స్టూడియోస్ పై ప్రేమ కృష్ణ‌ దాస్, సి.దేవదాస్, జయ దేవదాస్ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. టెంట్ కొట్టా (Tentkotta ) ఓటీటీలో ఈ మూవీ ఫిబ్రవరి 2 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మధురై ప్రాంతంలో ఉండే ఒక చిన్న పల్లెటూరు పొట్టేళ్ల పందాలకు ఫేమస్. ఆ ఊరిలో పొట్టేళ్ల పందెం గెలవడం అనేది కేవలం ఆట మాత్రమే కాదు, అది ఒక పెద్ద పరువు సమస్య కూడా. హీరో (యువన్ కృష్ణ)కి తన పొట్టేలు అంటే ప్రాణం. ఆటో నడిపే హీరో తన పొట్టేలును బరిలో దింపడానికి ప్రయత్నిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని ఎగతాళి కూడా చేస్తారు. మరోవైపు కార్తి (రిధాస్) అనే వ్యక్తి పొట్టేల్ వరుసగా గెలుస్తూనే ఉంటుంది. ఇంత వరకు దానిని ఓడించిన పొట్టేలు లేదు.

ఒక సారి ఈ రెండు పొట్టేళ్ళు బరిలోకి దిగుతాయి. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది. వరుసగా గెలిచే కార్తి పొట్టేలు హీరో పొట్టేలుతో ఒడిపోతుంది. దీంతో స్టోరీ రివేంజ్ మోడ్ లోకి వెళ్తుంది. ఈ క్రమంలో హీరోకి, విలన్లకి మధ్య జరిగే గొడవలు.. తన పెంపుడు జంతువును కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటం సినిమాను ఆసక్తికరంగా మారుస్తాయి. పక్కా ఊర మాస్ స్టైల్‌లో ఉండే ఈ సినిమాలో యాక్షన్ సీన్లు, పల్లెటూరి సెంటిమెంట్ బాగా హైలైట్ అవుతాయి.

Advertisement

Read Also : పెళ్లి కొడుకుకు ట్విస్ట్ ఇచ్చే ప్రియురాలు … ఓటీటీలోకి వచ్చేస్తున్న బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ మూవీ

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×