E-Paper
Advertisement

Prison Overcrowding: ఓరి దేవుడా ఇవి జైళ్లా.. కోళ్ల ఫారాలా?.. కిక్కిరిసిపోతున్న కారాగారాలు

Prison Overcrowding: ఓరి దేవుడా ఇవి జైళ్లా.. కోళ్ల ఫారాలా?.. కిక్కిరిసిపోతున్న కారాగారాలు

Prison Overcrowding: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని జైళ్లు కోళ్ల ఫారాలను తలపిస్తున్నయి. ప్రతీ కారాగారం పరిమితికి మించిన ఖైదీలతో కిక్కిరిసి కనిపిస్తోంది. దాంతో ఖైదీలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అదే సమయంలో ఉన్న సిబ్బందిపై పనిభారం విపరీతంగా పడుతోంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆయా జైళ్లలో శిక్షలు పడ్డ ఖైదీలకన్నా జ్యుడిషియల్​ రిమాండ్ లో ఉన్నవారే అయిదురెట్లకు పైగా ఉండటం.

శిక్షలు పడకుండానే శిక్ష..

సెంట్రల్​, ఉమెన్​ జైళ్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కారాగారాల్లో గత ఏడాది ఉన్న ఖైదీలు 42,566మంది. వీరిలో ఆయా నేరాల్లో శిక్షలు పడ్డవారు కేవలం 5,856మంది మాత్రమే ఉన్నారు. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య 36,627. దీనిపై సీనియర్ అధికారులతో మాట్లాడగా తెలిసో.. తెలియకో నేరాలకు పాల్పడి ఆయా జైళ్లకు రిమాండ్ అవుతున్న వారిలో అధికశాతం మందికి కోర్టులకు వెళ్లి బెయిల్ తీసుకునే ఆర్థిక సామర్థ్యం కూడా ఉండదని చెప్పారు. ఇక, న్యాయ స్థానాల్లో కేసులు ఏళ్ల తరబడిగా విచారణలోనే ఉండిపోతుండటం వల్ల కూడా వీళ్లు కారాగారాల్లో మగ్గిపోవాల్సి వస్తోందన్నారు. ఇక్కడ న్యాయ స్థానాలను కూడా తప్పు పట్టే పరిస్థితి లేదని చెప్పారు. ఆయా కోర్టులపై కేసుల భారం విపరీతంగా ఉంటోందని తెలిపారు. పోలీసుల దర్యాప్తులో జరుగుతున్న జాప్యం కూడా ఈ పరిస్థితికి మరో కారణమని చెప్పారు. కోర్టుల్లో వాయిదాలతోనే రిమాండ్​ ఖైదీల జీవితాలు ఎదురు చూపుల మధ్యనే జైలు నాలుగ్గోడల మధ్య గడిచిపోతున్నాయన్నారు.

Also Read: Jaggery: మీరు తినే బెల్లంలో సోడా కలిపారో లేదో.. ఇంట్లోనే ఇలా కనిపెట్టేయండి!

డ్రగ్స్ కేసుల్లో..

ఇక, ఆయా జైళ్లకు రిమాండ్​ అవుతున్న వారిలో దొంగతనాలు చేసి…మాదక ద్రవ్యాల దందా చేస్తూ పట్టుబడిన వారే అధికంగా ఉంటున్నారు. గత ఏడాది చోరీలు, దోపిడీలు చేసి దొరికి జైళ్లకు రిమాండ్​ అయిన వారు 7,792మంది ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో డ్రగ్స్​ కేసుల్లో 7,040మంది రిమాండ్​ అయ్యారు. ఆందోళనాకరమైన అంశం ఏమిటంటే కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నా పసిపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడి పట్టుబడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం. 2024లో పోక్సో యాక్ట్ ప్రకారం ఆయా జైళ్లకు 3,750మంది రిమాండ్​ కాగా, గత ఏడాది సంఖ్య 4,176కు పెరిగింది. మహిళలపై నేరాలకు పాల్పడి 3,478మంది రిమాండ్​ కాగా, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడి 2,833మంది జైళ్ల పాలయ్యారు. సిబ్బంది విషయానికి వస్తే జైళ్ల శాఖలో ఖాళీలు భారీ సంఖ్యలోనే ఉన్నాయి. దాంతో పని చేస్తున్న వారి పైనే పనిభారం విపరీతంగా పడుతోంది. ఖైదీల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుండటంతో సిబ్బంది వారిపై పూర్తి స్థాయిలో నిఘా కూడా పెట్ట లేకపోతున్నారు. దాంతో అవకాశం దొరగ్గానే కొందరు ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక, జైలు లోపల గ్రూప్ తగాదాల నేపథ్యంలో పరస్పరం దాడులు చేసుకున్న సంఘటనలు కూడా జరిగాయి. ఈ పరిస్థితి మారాలంటే వేగవంతమైన విచారణ, సత్వర తీర్పులు ఒక్కటే మార్గమని సీనియర్ అధికారులు అంటున్నారు. అయితే, ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఇది దాదాపుగా అసాధ్యమే అని చెప్పవచ్చని వ్యాఖ్యానించారు.

బహిరంగ జైళ్లు..

ఈ సమస్యకు బహిరంగ జైళ్లే పరిష్కారమని గతంలో సుప్రీం కోర్టు పేర్కొన్న విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. జైళ్లు, ఖైదీల అంశంపై రెండేళ్ల క్రితం దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ సూచన చేసినట్టు చెప్పారు. దీంట్లో పగలు ఆయా కేసుల్లోని రిమాండ్​ ఖైదీలు జైలు బయట పని చేసుకోవటానికి అవకాశం ఉంటుందన్నారు. సాయంత్రం కాగానే అంతా జైలుకు చేరాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, దీనిని అమలు చేస్తే ఖైదీలు తప్పించుకుని ఉడాయించే అవకాశాలు ఉండటంతో దీనిని అమల్లోకి తీసుకు రాలేదన్నారు.

Also Read; Nindu Nurella Savasam Pallavi : ‘ నిండు నూరేళ్ల సావాసం ‘ పల్లవి ఆస్తులు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×