E-Paper
Advertisement

Action Thriller OTT: ఓటీటీలో అదరగొడుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘నైట్ ఏజెంట్ సీజన్ 3’… సీట్ ఎడ్జ్ సస్పెన్స్

Action Thriller OTT: ఓటీటీలో అదరగొడుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘నైట్ ఏజెంట్ సీజన్ 3’… సీట్ ఎడ్జ్ సస్పెన్స్
Advertisement

Action Thriller OTT : భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజింగ్ సీన్స్ తో దూసుకెళ్తోంది ‘ది నైట్ ఏజెంట్ సీజన్ 3’. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో, నెట్‌ఫ్లిక్స్ దీనిని వరుసగా కొనసాగిస్తోంది. ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సిరీస్ ఒక స్పై ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది.  జేమ్స్ బాండ్ తరహాలో ఆడియన్స్ ను చూపు తిప్పుకోకుండా చేస్తోంది ఈ సిరీస్ .

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘ది నైట్ ఏజెంట్’ (The Night Agent) మాథ్యూ క్విర్క్ రాసిన నవల ఆధారంగా షాన్ ర్యాన్ రూపొందించిన ఒక అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్. గాబ్రియేల్ బాస్సో టైటిల్ రోల్‌లోనటించిన ఈ సిరీస్ మొదటి సీజన్ 2023 మార్చి 23న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయింది. ఈ సిరీస్ మొదటి నాలుగు రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో మూడవ అత్యధికంగా వీక్షించబడిన తొలి సిరీస్‌గా అవతరించింది. రెండవ సీజన్ 2025 జనవరి 23న విడుదలైంది. ఇప్పుడు మూడవ సీజన్ 2026 ఫిబ్రవరి 19 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది. ఇందులో పీటర్ సదర్లాండ్‌గా గాబ్రియేల్ బాస్సో ఈ అద్భుతమైన యాక్షన్‌తో సిరీస్‌ని నడిపించాడు. మొత్తం 10 ఎపిసోడ్‌లతో ఒక్కో ఎపిసోడ్ సుమారు 45 నుండి 55 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది ఈ సిరీస్.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సీజన్ 2 తర్వాత పీటర్ ఇప్పుడు ఒక ఫుల్ టైమ్ సీక్రెట్ ఏజెంట్ గా మారతాడు. ప్రభుత్వానికి సంబంధించిన అతి ముఖ్యమైన రహస్యాలతో ఇస్తాంబుల్‌కు పారిపోయిన ఒక ఏజెంట్‌ను పట్టుకోవడమే ఇప్పుడు పీటర్ మెయిన్ మిషన్. అయితే ఈ క్రమంలో పీటర్ బాస్ కాథరిన్ హత్యకు గురవుతుంది. దీంతో స్టోరీ మరింత ఇంటెన్స్ గా సాగుతుంది. అంతేకాకుండా ఆ పారిపోయిన ఏజెంట్ కేవలం నేరస్తుడు కాదని, అమెరికాలోని పెద్ద కంపెనీలు ఉగ్రవాదులకు రహస్యంగా డబ్బులు పంపిస్తున్నాయని కనిపెట్టడం వల్లే అతన్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని పీటర్ తెలుసుకుంటాడు. కథ ముందుకు సాగే కొద్దీ ఈ కుట్ర వెనుక కేవలం బయటి వ్యక్తులే కాకుండా, సాక్షాత్తూ అమెరికా ప్రెసిడెంట్, అతని భార్య ఉన్నారని పీటర్ కనిపెడతాడు. ఒక జర్నలిస్ట్ సాయంతో పీటర్ ఆ దేశద్రోహులను ప్రపంచం ముందు ఎలా నిలబెట్టాడు ? తన ప్రాణాలకు తెగించి ఆ దేశాన్ని ఎలా కాపాడాడు ? అనేదే ఈ సీజన్ అసలు కథ.

Read Also : పూల తోటలో మృతదేహాలు… ప్రేమలో పడ్డ అమ్మాయిని కూడా… ఈ ఆరు ఎపిసోడ్‌ల క్రైమ్ థ్రిల్లర్ భీభత్సమే

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×