E-Paper
Advertisement

Chanakya Niti: తేనె పూసిన కత్తులు.. మీ స్నేహితుల్లో దాగున్న శత్రువులను ఇలా గుర్తించండి!

Chanakya Niti: తేనె పూసిన కత్తులు.. మీ స్నేహితుల్లో దాగున్న శత్రువులను ఇలా గుర్తించండి!
Advertisement

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. కేవలం మంచి మనసు కలిగి ఉండటం మాత్రమే జీవితంలో విజయానికి సరిపోదు. లోకజ్ఞానం, వ్యూహం లేని మంచితనం ఒక్కోసారి మనకే శాపంగా మారుతుంది. అడవిలో తిన్నగా ఉన్న చెట్లనే మొదట నరుకుతారని, వంకరగా ఉన్నవి సురక్షితంగా ఉంటాయని చాణక్యుడు హెచ్చరించారు. అంటే, అతి అమాయకత్వం లేదా వ్యూహం లేని మంచితనం మిమ్మల్ని ఇతరుల చేతిలో మోసపోయేలా చేస్తుంది. సమాజంలో గౌరవంగా బతకడానికి మంచితనంతో పాటు తెలివైన వ్యూహం కూడా అవసరం.

మంచితనం, వ్యూహం:
ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’లో మనిషి ప్రవర్తన, సమాజం, మనుగడ గురించి లోతైన విషయాలను చర్చించారు. ఆయన దృష్టిలో మంచితనం అనేది ఒక గొప్ప గుణం, కానీ అది ‘వ్యూహం’ అనే కవచం లేకుండా ఉంటే.. అది వ్యక్తిని బలహీనుడిని చేస్తుంది.

Advertisement

1. తిన్నని చెట్టు ఉదాహరణ:
చాణక్యుడు ఒక ప్రసిద్ధ శ్లోకంలో ఇలా అంటారు. “అడవికి వెళితే తిన్నగా పెరిగిన చెట్లనే మొదట నరుకుతారు. వంకరగా ఉన్న చెట్లు అలాగే ఉంటాయి.” దీని అర్థం సమాజంలో అతి అమాయకంగా.. అతి మంచితనంతో ఉండేవారిని లోకం త్వరగా వాడుకుంటుంది లేదా అణచివేస్తుంది. మంచితనం ఉండాలి. కానీ అది ఇతరులకు మిమ్మల్ని తక్కువ చేసే అవకాశం ఇవ్వకూడదు.

2. పాము, విషం:
పాము విషపూరితమైనది కాకపోయినా.. అది బుస కొట్టడం మాత్రం మానకూడదు అంటారు చాణక్యుడు. అంటే.. మీరు స్వభావరీత్యా శాంతమూర్తులు అయినప్పటికీ.. ఎదుటివారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే.. అప్పుడప్పుడు కఠినంగా వ్యవహరించడం అవసరం. లేదంటే శత్రువులు లేదా స్వార్థపరులు మిమ్మల్ని సులభంగా లోబరుచుకుంటారు.

Advertisement

3. స్వార్థపరుల మధ్య మనుగడ:
లోకం అంతా మంచివారితో నిండి లేదు. మీరు అందరినీ నమ్మి, అందరికీ సహాయం చేస్తూ పోతే, మీలోని ఉదారతను బలహీనతగా భావించే వారు చాలా మంది ఉంటారు. అందుకే.. ఎవరికి ఎంతవరకు సహకరించాలి. ఎవరితో ఎంత దూరం ఉండాలి అనే వ్యూహం మీ దగ్గర ఉండాలి. వ్యూహం లేని మంచితనం మిమ్మల్ని ఆర్థికంగా, మానసిక శ్రమకు గురి చేస్తుంది.

4. రహస్యాలను దాచుకోవడం:
అమాయకత్వంతో మీ బలహీనతలను, రహస్యాలను అందరితో పంచుకోవడం మంచితనం అనిపించుకోవచ్చు. కానీ చాణక్యుడి ప్రకారం అది ఆత్మహత్యాసదృశ్యం. మీ వ్యూహాలు కేవలం మీ దగ్గరే ఉండాలి. మీ తర్వాతి  డుగు ఏమిటో శత్రువుకు కూడా ఊహకు అందకూడదు.

5. ధర్మం, రాజనీతి:
కేవలం ధర్మబద్ధంగా ఉండటమే కాకుండా.. కాలానికి అనుగుణంగా రాజనీతిని ప్రదర్శించాలని చాణక్యుడు చెబుతారు. యుద్ధంలో కేవలం వీరత్వం ఉంటే.. సరిపోదు, గెలవడానికి కావాల్సిన ఎత్తుగడలు కూడా ఉండాలి. జీవితం కూడా ఒక యుద్ధమే. ఇక్కడ మంచితనం మీ ఆయుధం అయితే.. వ్యూహం మీ రక్షణ కవచం.

Also Read: స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే

6. స్నేహంలో జాగ్రత్త:
“శత్రువు కంటే.. మిత్రుడి విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి” అని చాణక్యుడు హెచ్చరిస్తారు. ఎందుకంటే.. మిత్రుడికి మీ రహస్యాలన్నీ తెలుసు. ఒకవేళ మనస్పర్థలు వస్తే.. ఆ సమాచారంతో మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకే అతిగా ఎవరినీ నమ్మకూడదు.

మంచితనం అనేది ఒక సంస్కారం. కానీ తెలివితేటలు అనేవి మనుగడకు ఆధారం. సింహం లాంటి ధైర్యం, నక్క లాంటి తెలివితేటలు, ఆవు లాంటి మంచితనం.. ఈ మూడింటి కలయికే ఒక వ్యక్తిని పరిపూర్ణుడిని చేస్తుంది. మీరు మంచి వారు కావాలి. కానీ మోసపోయేంత అమాయకులు మాత్రం కాకూడదు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×