E-Paper
Advertisement

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. చట్టసభల్లో ఆ కీలక మావోయిస్టులకు సీట్లు..?

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. చట్టసభల్లో ఆ కీలక మావోయిస్టులకు సీట్లు..?
Advertisement

Telangana Politics: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో చారిత్రాత్మక మార్పునకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోన్నది. జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఆసక్తికర చర్చకు దారితీసింది. దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని, ప్రజా పోరాటాల్లో పాల్గొని, ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కొనసాగుతున్న మాజీ మావోయిస్టులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలనే ప్రపోజల్ వచ్చినట్లు సమాచారం. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా పాజిటివ్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే డీ లిమిటేషన్ తర్వాత సుమారు రెండు లేదా మూడు అసెంబ్లీ సీట్లు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. ప్రజాసమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన నేతలను ఎంపిక చేసుకోనున్నారు. అయితే ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో పార్టీ ముఖ్య నేతలు, ప్రభుత్వ పెద్దల అభిప్రాయాలను పార్టీ సేకరించనున్నది. వివిధ దఫాలుగా చర్చలు అనంతరం మాత్రమే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

డీ లిమిటేషన్ తర్వాతనే..?

ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్​ట్రంలో జనాభా ప్రతిపాదికన 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. డీ లిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య పెరగనున్నది. మరో ఆరు నెలల్లో జనగణన పూర్తయ్యాక పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనివల్ల రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉన్న 119 నుండి కనీసం 153కి, పార్లమెంట్ స్థానాలు 17 నుండి 23-25 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. పెరిగిన స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కూడా అమలు కానున్నాయి. ఈ నేపథ్​యంలో ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి రావాలనుకునే మాజీ మావోయిస్టులకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. దీని ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, మాజీ ఉద్యమకారులను ప్రధాన స్రవంతిలో గౌరవప్రదంగా నిలబెట్టడం ద్వారా ఒక సానుకూల సందేశాన్ని పంపవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.అయితే ఈ పరిణామం మాత్రం ఓ కీలక ఎపిసోడ్ గా మారనున్నది. ఒకప్పుడు తుపాకీ పట్టిన చేతులకు చట్టసభల్లో అవకాశం కల్పించడం అనేది తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక “ల్యాండ్‌మార్క్” గా నిలిచిపోతుందని సీరియర్ రాజకీయ నేతలు చెప్తున్నారు.

Advertisement

Also Read: Vishnu Vinyasam: ఎన్ని విన్యాసాలు వేసినా ఏం లాభం.. థియేటర్లు ఖాళీ! ఖర్చులు కూడా కష్టమేనా?

ఆ నేతలు చేరుతారా?

ఇక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సుమారు 30 నిమిషాలకు పైగా మాజీ మావోయిస్టుల సమావేశం జరిగింది. దీనిలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దేవ్‌జీ ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. మల్లా రాజిరెడ్డి మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం లొంగిపోయిన సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని స్పష్టంగా వెల్లడించిన దేవ్‌జీ తాజాగా సీఎంతో జరిగిన సమావేశంలో తన అభిప్రాయాన్ని పంచుకున్నట్లు సమాచారం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తున్నది. మరి కొంత మంది నేతలకు కూడా రాజకీయాలపై ఆసక్తిని కనపరిచినట్లు తెలిసింది.

Advertisement

Also Read: Vijay – Rashmika: విజయ్- రష్మిక ధరించిన నగల బరువు అన్ని కేజీలా.. ఖరీదు తెలిస్తే షాక్!

Related News

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

Big Stories

Advertisement
×