E-Paper
Advertisement

ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్… మాఫియా సామ్రాజ్యాన్ని వల్లకాడు చేసే కిల్లర్

ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్… మాఫియా సామ్రాజ్యాన్ని వల్లకాడు చేసే కిల్లర్
Advertisement

Action Thriller OTT : ఓటీటీలో యాక్షన్ సినిమాలు బోలెడు ఉన్నాయి. అయితే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సినిమాలు చాలా క్రేజీగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యాక్షన్ సినిమా ఇండోనేషియా నుంచి వచ్చింది. ఇందులో హింస, రక్తపాతం ఓ రేంజ్ లో ఉంటాయి. అంతేకాదు అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ తో వచ్చే ఫైట్స్ కోసం మళ్ళీ మళ్ళీ చూస్తారు ఈ సినిమాను. ప్రతి ఫైట్ సీక్వెన్స్‌లోనూ ఎముకలు విరగడం, కత్తులతో కోయడం వంటి దృశ్యాలను చాలా వైలెంట్ గా చూపిస్తుంది ఈ సినిమా. ఇండోనేషియన్ మార్షల్ ఆర్ట్స్ విద్య అయిన ‘పెన్కాక్ సిలాట్’ను ఉపయోగించి తీసిన ఈ సినిమా ఇది. అయితే ఎక్కువ హింసను తట్టుకోలేని వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ ఇండోనేషియా యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది నైట్ కమ్స్ ఫర్ అస్’ (The Night Comes for Us). 2018లో వచ్చిన ఈ సినిమాకు టిమో తజాంటో దర్శకత్వం వహించారు. ఇందులో జో తస్లిమ్, ఇకో ఉవైస్, జూలీ ఎస్టెల్లే లీడ్ రోల్స్ లో నటించారు. తుపాకులు, కత్తులు, మార్షల్ ఆర్ట్స్‌తో సాగే ఈ సినిమా, ఇండోనేషియా చిత్ర పరిశ్రమలోనే అత్యంత భీకరమైన యాక్షన్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ‘పెన్కాక్ సిలాట్’ అనే మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాలో క్రూరంగా చూపించారు. ఈ సినిమాలో నటించిన జో తస్లిమ్, ఇకో ఉవైస్ వంటి నటులు నిజ జీవితంలో కూడా గొప్ప మార్షల్ ఆర్టిస్టులు కావడం వల్ల, డూప్స్ లేకుండా చేసిన ఫైట్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. ఇది నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా. నేటికీ యాక్షన్ ప్రియులకి ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిపోయింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో హీరో ఒక పెద్ద గ్యాంగ్‌లో మెయిన్ రౌడీ. వీడు ఎంత కిరాతకుడంటే, పై వాళ్ళు చెప్తే ఎంతమందిని అయినా లేపేస్తాడు. ఒకరోజు ఒక ఊరిని మొత్తం లేపేయమని అతనికి ఆర్డర్ వస్తుంది. చాలా మందిని లేపేస్తాడు కూడా, అయితే అక్కడ ఉన్న ఒక చిన్న పాపని చూసి హీరోకి ఎక్కడలేని జాలి పుడుతుంది. ఆ పాపని చంపకుండా కాపాడతాడు. అక్కడి నుంచి మాఫియా గ్యాంగ్ అతనికి పక్కా శత్రువు అయిపోతుంది. మా మాటే పక్కన పెడతావా అంటూ ఆ గ్యాంగ్ లీడర్లకు పిచ్చెక్కిపోతుంది. దీంతో ఆ పాపతో పాటు హీరోని చంపడానికి వందలాది మంది కిరాయి హంతకులను రంగంలోకి దింపుతారు.

ఇక సినిమా అంతా ఒకటే రచ్చ. హీరో తన పాత ఫ్రెండ్స్ తో కలసి, గ్యాంగ్ మొత్తాన్ని ఒక్కొక్కడిని నరుక్కుంటూ వెళ్తుంటాడు. ఇందులో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే.. ఇందులో హీరో ప్రాణ స్నేహితుడు ఏరియన్ ఎంట్రీ ఇవ్వడంతో వస్తుంది. వీళ్ళిద్దరూ ఒకప్పుడు కలిసి తిరిగినోళ్ళే, కానీ ఇప్పుడు ఏరియన్ తన గ్యాంగ్ కోసం సొంత ఫ్రెండ్ నే చంపడానికి వస్తాడు. ఒకరేమో పాపని కాపాడాలని, ఇంకొకరేమో గ్యాంగ్‌లో తన పరువు నిలబెట్టుకోవాలని ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటారు. దెబ్బకి దెబ్బ, రక్తం ఏరులై పారుతుంటుంది.

Advertisement

క్లైమాక్స్ కి వచ్చేసరికి సినిమా పీక్స్‌లో ఉంటుంది. ఒక్క హీరో వందల మందిని చితక్కొట్టడం, ఆ యాక్షన్ సీన్లు చూస్తే బుర్ర పాడైపోద్ది. చివర్లో హీరో తన స్నేహితుడు ఏరియన్‌తో చేసే ఫైట్ అయితే మాములుగా ఉండదు. ఇక హీరో తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ చిన్న పాపని సేఫ్ గా పంపించాడా? ఆ గ్యాంగ్ అంతాన్ని చూశాడా ? ఈ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : గ్యాంగ్స్టర్లు గన్ లు.. మధ్యలో ఒకే ఒక్క పోలీస్… ఈ యాక్షన్ సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరబ్బా

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×